Health Benefits : వాము మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అయితే, వాము ఆకులతో కూడా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ వాము చెట్టు ఆసియా ఖండంలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ వాము మొక్కను అజ్వైన్ అని కూడా పిలుస్తారు. ఈ ఆకులను సుగంధ ద్రవ్యంగా కూడా ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
కొద్దిమంది మాట్లాడుతుంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఇటువంటి వారితో మాట్లాడేందుకు ఎవరు ఇష్టపడరు. అయితే, వాముఆ కులతో ఈ సమస్యను నివారించవచ్చు. వాము ఆ కులు అద్భుతమైన మౌత్ ఫ్రెష్ నింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నోటి ఆరోగ్యాన్ని పెంచేందుకు బాగా సహాయపడతాయి.
జీర్ణ సంబంధ సమస్యలకు వాము ఆకుతో చెక్ పెట్టవచ్చు. అయితే రోజు రెండు వాము ఆ కులు నమ్మితే తిన్న ఆహారం త్వరగా చిరునమవుతుంది గ్యాస్ ,కడుపుబ్బరం వంటి సమస్యలును చేసుకోవచ్చు.
Health Benefits : వాము ఆకుల తో జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చా.? అది ఎలాగంటే.
రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే రోజు వాము ఆకులను తీసుకుంటే చాలు. ఫ్లూ, జలుబు దగ్గు లాంటి లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి వివిధ ఇన్ఫెక్షలతో పోరాడే శక్తి లభిస్తుంది. వాము ఆకులను పండ్లు ,కూరగాయలను కలిపి జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. శరీరంలో పోషక విలువలు పెంచుకునేందుకు, వివిధ రకాల వంటల్లో వాము ఆకులను చేర్చుకోవచ్చు. వాము ఆకుల చట్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు మనం తాగే టీలో రెండు వాము ఆకులను శుభ్రం చేసి మరిగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకులను సలాడులో కలిపి తీసుకోవచ్చు