Guppedantha Manasu 19 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 19-September-2022 ఎపిసోడ్ 559 ముందుగా మీ కోసం. వసుధార, రిషి దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ రిషి మాట్లాడకపోవడంతో, బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తరువాత జగతి మహేంద్ర ఇద్దరూ చాలా బాధపడతారు, మన వలన వాళ్లు విడిపోవాల్సి వచ్చింది, లేదంటే వసు, రిషి చాలా సంతోషంగా ఉండేవారు అని అనడంతో, అవును నేనే ఇదంతా చేశాను అని మహేంద్ర అనడంతో, నేను అనేదాన్ని లేకపోతే ఇలా జరిగేది కాదు కదా మహేంద్ర అని జగతి అంటోంది, ఇలా వీళ్లు ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు, అప్పుడు మహేంద్ర అంటాడు ఏదో ఒకరోజు నిజం అనేది బయటికి వస్తుంది, అప్పుడు తెలుస్తుంది, రిషి తన తప్పు తానే తెలుసుకొనే రోజు కూడా వస్తుంది. అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకవైపు దేవయాని చాల సంతోషపడుతుంది.ఇల్లంతా ఇలా ప్రశాంతంగా ఉంటే ఎంత బావుందొ ఏడ్పులు ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, మరి లేకపోతే ఏంటి నన్ను పట్టించుకోకుండా వీళ్లకి వీళ్లు సంతోషంగా ఉంటారు.
ఇప్పుడు చూడు ఏమైందో అని తనలో తాను సంతోషపడుతూ ఉంటుంది దేవయాని, రిషి దగ్గరికి వెళ్లి నాన్నా నేను నీ గురించే బాధపడుతున్నానని, నీ కోసమని ఇప్పటిదాకా తినకుండా ఉన్నాను అని చెప్పి, ఇలా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. నేను వసుధార ఎంత తెలివైనదో తెలియాలి అని ఇలా చేశానని అంతే తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు నాన్నా, తను కూడా చాలా మంచిది అనడంతో, రిషి పెద్దమ్మా ఈ ఇంట్లో మీరొక్కరే నాకు ఉన్నది, మీరు కూడా ఇలా మాట్లాడకండి అని చెప్పడంతో, దేవయాని లోలోపల సంతోషపడుతూ ఉంటుంది, రిషి మనసులో నేనొక్కదాన్నే ఉన్నాను ఇదే కదా నాకు కావలసింది అని వెళ్లిపోతుంది సంతోషంగా, దేవయాని రూమ్లోకి వెళ్లి రాజీవ్ ఫోన్ చేస్తూ ఉంటుంది.
Guppedantha Manasu 19 September 2022 Episode : వసుధార ని ప్రశ్నించిన రిషి
ఇదే సరైన సమయం వీళ్లిద్దరూ విడిపోయివున్నారు, నువ్వు వసుధారని పెళ్లిచేసుకోవాలనుకుంటే, ఈ అవకాశం వదులు కొవద్దు అని తనతో మాట్లాడుతుంది, ఇదంతా ధరణి వింటుంది. మీ నిజస్వరూపం బయట పడే రోజు వచ్చింది, ఇంత కుట్ర పన్నుతార అత్తయ్యా అని ధరణి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఏమీ తెలియనట్టు దేవయాని దగ్గరికి వెళ్ళి కాఫీ ఇస్తుంది. రిషి వసుధార బయట కలుసుకుంటారు. ఒక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు అని రిషి, వసుధారని అడుగుతాడు. నువ్వు నన్ను ప్రేమించింది రిషి సార్ గానా, లేకపోతే జగతి మేడం కొడుకుగా నా అని అనడంతో, ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. వసుధార ఏమి సమాధానం చెప్పబోతున్నది,తాను ఏ తప్పూ చేయలేదు అని ఎలా నిరూపించుకో పోతున్నది, దేవయాని కుట్ర నుంచి వసుధార తప్పించుకోగలదా, రిషి వసుధార ని రాజీవ్ బారి నుంచి కాపాడగలుగుతాడా ఇవన్నీ రానున్న ఎపిసోడ్లో తెలుస్తోంది.