Karthika Deepam 19 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1461 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్, శివ మాట్లాడుకుంటూ ఉండగా… వంటలక్క కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు శివ సార్ మేడమ్ ఇంట్లో లేదు కదా.. నేను రాత్రికి మందు తెచ్చుకుంటాను అని అంటాడు. అప్పుడు మంద.. నీకు అలవాటు ఉందా.. అని అనుకుంటూ నువ్వు ఎంత తాగుతావు అని అడుగుతాడు. అప్పుడు శివ ఆప్ తాగుతాను సార్ అని అంటాడు. అప్పుడు ఫుల్ తీసుకుని రా అని అంటాడు. అప్పుడు శివ సార్ మీకు అలవాటు ఉందా.. అని అనగా.. ఏమో మరి నాకు గుర్తుండదు కదా.. అని డబ్బులు ఇచ్చి మందు తీసుకు రమ్మని చెబుతాడు. శివ వెళ్ళిపోతాడు. కార్తీక్ కూర్చుని నాకు ఇంతకీ మందులవాటు ఉందా.? లేదా.? అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే సౌందర్య మోనిత, మౌనిత కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మౌనిత ఎందుకండీ ఇలా చేస్తుంది అని ఆనంద్ రావ్ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమో కన్న ప్రేమ గుర్తొచ్చిందేమో అని అంటాడు. అప్పుడు సౌందర్య కన్న ప్రేమ నా.. ఇంకేమన్న దానికి అలాంటిదేమీ లేదండి. ఇన్ని రోజులు ఇక్కడ ఉంచి ఇప్పుడు తీసుకెళ్లింది అంటే ఏదో కారణం ఉంటుంది.
Karthika Deepam 19 September Today Episode : ఆనంద్ ని ఎత్తుకొని గతం గుర్తుతెచ్చుకుంటున్న కార్తీక్…
ఆ బాబుని అడ్డం పెట్టుకొని ఏదో ఘనకార్యం చేయబోతుంది. తన అడ్రస్ కూడా చెప్పలేదు అంటే కచ్చితంగా కార్తీక్ సంబంధించిన ది అయ్యే ఉంటుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంద్ రావు ఇప్పుడు దాన్నేలా తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు.కట్ చేస్తే వంటలక్క బజ్జీలేస్తూ ఉంటుంది. అప్పుడు శివ అటువైపుగా వస్తూ ఉంటాడు. అప్పుడు దీప శివ అని పిలుస్తున్న గాని వెళ్ళిపోతూ ఉంటాడు. తమ్ముడు శివ అని ప్రేమగా పిలుస్తుంది దీప. అప్పుడు శివ భయపడుతూ వస్తాడు. అప్పుడు నన్ను తమ్ముడు అని పిలవకు నేను నీతో మాట్లాడను వెళ్ళిపోతాను అని అంటుండగా.. తమ్ముడు మీ మేడం లేదు కదా నేను మీ మేడంకి చెప్పనులే అని అంటుండగా… సరే అక్క చెప్పవు కదా అని అంటుండగా అయితే చికెన్ పకోడీ ఇవ్వక్క అని అంటాడు. అప్పుడు నువ్వెళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత తీసుకొని వస్తాను అని అంటుంది దీప. కట్ చేస్తే సౌర్య వారణాసిని తిడుతూ ఉంటుంది. నేను అమ్మ నాన్నలు కనపడే వరకు నేను ఎక్కడికి రాను… అప్పుడు వారణాసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా నువ్వు ఇక్కడే ఉండు నేను నీతో పాటే ఉంటా నన్ను మాత్రం వెళ్ళొద్దని చెప్పుకు అని అంటాడు. కట్ చేస్తే కార్తీక్ శివ కలిసి మందు తాగుతూ ఉంటారు. అప్పుడు శివ నీక్కూడా మందు పోసుకోమని చెప్పి అని కంపెనీ ఉంటే భలే ఉంటుంది అంటూ ఉంటాడు.

అప్పుడు శివ సార్ మీకు మందు అలవాటు ఉంది. సార్ అని అంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ నీకు మేనేస్ లేదయ్యా మందు తెచ్చావు గాని స్టప్ తీసుకురాలేదు.. అని అంటాడు. అప్పుడు దీపక్క తీసుకొస్తదని చెప్పాను కదా సార్ అని అంటాడు శివ. అంతలో దీప చికెన్ పకోడీ తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ చికెన్ పకోడీ కార్తీక్ తింటూ సూపర్ గా ఉంది అంటూ.. ఒక యాపిల్ తీసుకొని రా ఇంకా అదైతే బాగుంటుంది అని అంటూ వంటలక్క అక్కడ ఆపిల్ ఉంది. తీసుకొనిరా అంటూ ఉంటారు. అప్పుడు దీప ఆశ్చర్యంగా చూస్తూ అప్పుడు విషయాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత కూర్చొని ఉండగా.. ఏమైనా కబుర్లు చెప్పు వంటలక్క అని అంటూ ఉంటాడు. అప్పుడు కబుర్ల కబుర్లు అంటే మీ గురించే చెప్పాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు నా గురించా.. అని అంటుండగా.. అంటే మా డాక్టర్ బాబు గురించి అంటూ మా డాక్టర్ బాబు తోని నేను మందు తాగాను అంటూ అప్పుడు జరిగిందంతా తనకి చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ భలే సరదాగా ఉంది వంటలక్క అంటూ..
మీ డాక్టర్ బాబుకి మీరంటే చాలా ఇష్టం అనుకుంటా అని అంటాడు. అప్పుడు అవును డాక్టర్ బాబు చాలా ఇష్టం ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అంటూ అంతా చెబుతూ ఉంటుంది. అలా దీప చెప్తూ ఉండగా కార్తీక్ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు దీప నా అదృష్టం ఇలా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో శివ వచ్చి ఇద్దరు కలిసి తీసుకొచ్చి కార్తీక్ ని బెడ్ మీద పడుకోబెడతారు. అప్పుడు శివ నాక్కూడా నిద్రొస్తుంది. అక్క నేను వెళ్లి హాల్లో పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక దీప కార్తీక్ రిపోర్టులు వెతికి తీసుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దీప కార్తీక్ టీ తీసుకొచ్చి ఇస్తుండగా.. అంతలో మౌనిత వచ్చి ఆ టీ ని నెట్టిపడేస్తుంది. అప్పుడు కార్తీక్ ఆనంద్ ని చూసి ఈ బాబు ఎవరు అని అంటుండగా ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు దీప డాక్టర్ బాబు మీరు ఎత్తుకొని చూడండి తను ఏడుపు ఆపుతాడు అని అనగానే కార్తీక్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. అవును నిజమే నా దగ్గరికి రాగానే ఏడుపు ఆపేశాడు అని అంటుండగా… దీప ఈ బాబుని చూస్తే మీకేదైనా గుర్తుకొస్తుందా అని అంటుండగా.. కార్తీక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత నేను తప్పు చేశానా.. అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతే తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…