Guppedantha Manasu 21 September 2022 Episode : గుప్పెడoత మనసు సీరియల్ 21-September-2022 ఎపిసోడ్ 561 ముందుగా మీ కోసం. రిషి వసుధార ఇంటి నుంచి బయలుదేరుతారు ఒక దగ్గర రిషి కార్ ఆపగానే, వసుధార సార్ ఈరోజు మీరు క్యాంటీన్ కి వస్తారా అనగానే, నీతో మాట్లాడాలి వసుధార అని రిషి అంటాడు. నువ్వు నన్ను జగతి మేడం కొడుకుగా ప్రేమించావా, లేకపోతే రిషి లా ప్రేమించావా అని అనగానే, నేను ప్రేమించిన వ్యక్తి జగతి మేడం కొడుకే కదా సార్ అని అనడంతో, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది, కొత్త సమస్యలు తెచ్చుకోకు మన మధ్య దూరం కూడా రాదు అని ఇలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వసుధార వెనక్కి తిరిగేలోపు అక్కడ ముళ్ళు ఉంటుంది రిషి పట్టుకుంటాడు వసుధారని ఇలానే జీవితంలో కూడా కొన్ని ముళ్లు ఉంటాయి చూసుకుని వెల్లు వసుధార అని రిషి చెపుతాడు, తర్వాత దేవయాని ధరణి ని తిడుతూ ఉంటుంది, నువ్వు చక్కెర కలిపిన పెరుగును వసుధారకి ఇస్తావా అలా ఇవ్వడం కేవలం ఒక ఆడపిల్ల పుట్టింటికి గానీ అత్తింటికి గాని వెళ్లేటప్పుడు ఇస్తారు నువ్వు ఏ ఉద్దేశ్యంతో ఇచ్చావు అని అడుగుతుంది.
ఇంతలో జగతి మహేంద్ర కూడా అక్కడికి వస్తారు, ధరణికి చెబుతారు నువ్వేం బాధపడకమ్మా అని, తరువాత రిషి వసుధారాణి ఇంటి దగ్గర దించి వెళుతుండగా నీ మీద నాకు ప్రేమ పోదు, జగతి మేడమ్ మీద ఉన్న ఉద్దేశం పోదు, నువ్వు ఆకాశ దీపం వదులుతూ ఏమి కోరుకున్నావొ నాకు తెలుసు, కానీ అది ఎప్పుడూ జరగదు, నువ్వే ఆలోచించుకో ఒకసారి ప్రశ్నను ఎప్పుడు నీవైపే కాదు నా నా వైపు నుంచి కూడా ఆలోచించి సమాధానం నీకు దొరుకుతుంది అని ఇలా రిషి వసుధారతో చెప్పి వెళతాడు. ఒకవైపు మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు, జగతి మహేంద్ర ఇద్దరూ రిషి గురించే ఆలోచిస్తూ ఉంటారు, రిషి మహేంద్ర తో అన్న మాటల్ని గురించి మాట్లాడుతూ,మహేంద్ర నీ ప్రేమ స్వార్థం అని రిషి అన్నా కూడా, నీకు రిషి మీద కోపం రాలేదు, బాధ కలిగింది ఇది నిజమైన ప్రేమ అంటే అని జగతి అంటుంది, వసు, రిషి ఇద్దరూ దూరం అవ్వకూడదు వీళ్లు సంతోషంగా ఉండాలి అని ఇలా ఇద్దరు బాధపడుతూ ఉంటారు.
Guppedantha Manasu 21 September 2022 Episode : గురుదక్షిణ విషయంలో వసుధార మాటల్ని రిషి వింటాడా?
వసుధార ఇంట్లో కూర్చొని రిషి సార్ ఎలా అయిన తెలుసుకోవాలి స్వార్థంగా ఆలోచించే మనుషులు ఎవ్వరొ, నిజాయితీ ఉన్న మనుషులు, నిజమైన ప్రేమ ఏంటో తొందర్లోనే రిషి సార్ తెలుసుకుంటాడు అని అనుకుంటూ ఉంటుంది. రిషి కూడా అనుకుంటూ ఉంటాడు నువ్వు అనుకున్నట్టు నేను మారను వసుధార అని అనుకుంటాడు. మహేంద్ర డల్లుగా కూర్చొని ఉండగా, గౌతం వచ్చి ఏమైంది అంకుల్ అనగానే, ఏమీ లేదు అని మహేంద్ర అంటాడు ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. తర్వాత వసుధార రెస్టారెంట్లో రిషి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది, రిషి సార్ వస్తాడా రాడా అని ఇంతలో రిషి వస్తాడు, రిషితో మాట్లాడేలోపే కాఫీ తీసుకుని రా అని చెబుతాడు, వసుధార కాఫీ తీసుకుని వస్తుంది, సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి అనగానే, ఏదో ఒక నీతిబోధను చేస్తూనే ఉంటావు కదా ఫర్వాలేదు చెప్పు వింటాను అనగానే, గురుదక్షిణ అని అనడంతో, ఆ విషయం తప్ప ఏదైనా మాట్లాడు అని రిషి అంటాడు. వసుధార గురుదక్షిణ గురించి మాట్లాడగలదా లేదా ఎలా మాట్లాడుతుందో రానున్న ఎపిసోడ్లో తెలుస్తోంది.