Karthika Deepam 21 September Today Episode : వంటలక్కే నా భార్య అంటున్న కార్తీక్… కార్తీక్ ఎలాగైనా ఊరికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న మౌనిత…

Karthika Deepam 21 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని ఆదరణ పొందుతుంది. ఈ రోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1463 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత కార్తీక్ ఇక్కడ నుంచి ఎలాగైనా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా… అంతలో అక్కడికి కార్తీక్ వచ్చి బాబు పేరేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మౌనితా కొద్దిసేపు ఆలోచించి తన పేరు ఆనంద్ అని చెప్తుంది. అలా చెప్పగానే కార్తీక్ నాకు ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు మౌని తా కంగారుపడుతూ.. నీ కొడుకే కదా నేను రోజు ఆ పేరుని అంటాను కదా అందుకే నీకు విన్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు కార్తీక్ అవును కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. కట్ చేస్తే దీప ఇంట్లోకి వెళుతుండగా.. అప్పుడు మౌనిత ఆగవే ఎక్కడికెళ్తున్నావ్ నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేదా నా ఇంటిని వదలవా… నా సంసారాన్ని వదలవా… అని అంటుండగా… రివర్స్లో దీప ఎవరు సంసారంలోకి ఎవరు అడుగు పెట్టారు.

Advertisement

పెళ్లయిన మగాడి వెంట పడుతూ పిచ్చిదానిలా చేస్తున్నావు అంటుంది. అప్పుడు మౌనిత నీతో పెళ్లి అయిందని తెలిసినా కానీ నా కార్తిక్ ని నేను సొంతం చేసుకోవాలని అనుకున్న అంటూ మౌనిత దీపపై మండిపడుతూ ఉంటుంది. నా భర్తకి గతం గుర్తు రాకుండా ఉండాలని ఇదంతా చేస్తున్నావు తనకి ఏమైనా అయితే ఏంటే పరిస్థితి.. అయినా నీ భర్త కాదు కదా కార్తీక్ బాబు ఒకవేళ ఏమన్నా అయితే ఇంకొకడిని చూసుకుంటావు అంతేగా అని అనగానే… మౌనిత ఏం మాట్లాడుతున్నావే ఈ జన్మకంటూ నా జీవితంలో మగాడు అంటూ ఉన్నాడంటే అది కార్తీక్ మాత్రమే అని అంటుంది. అప్పుడు దీప నీ ఆటలన్నీ డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చే వరకే గతం గుర్తొచ్చాక నీ చెదలు అంతా దులుపుతాడు అని అంటుంది. అప్పుడు మౌనితా గుర్తుకురాదు గుర్తుకు రానివ్వను అని గట్టిగా అంటుంది. చూసావు కదా నా కొడుకుని చేతిలో పెట్టి తనని అలా మాయలో పడేసాను. ఇక నా భర్త అవ్వడం ఎంతసేపు అని అంటుంది. నీ కొడుకు ద్వారా నా భర్తకి గతం గుర్తుకొస్తుంది. ఆ జ్ఞాపకాల్లో నేను కూడా ఉంటాను కచ్చితంగా నేను గుర్తుకొస్తాను. నా భర్త నాకు సొంతమవుతాడు. అప్పుడు మౌనితా ఆలా జరగదు అని అంటుండగా…

Advertisement

Karthika Deepam 21 September Today Episode : వంటలక్కే నా భార్య అంటున్న కార్తీక్…

Karthika Deepam 21 September Today Episode
Karthika Deepam 21 September Today Episode

పోయాను అనుకున్న నేనే తిరిగి వచ్చాను. డాక్టర్ బాబుకి గతం గుర్తుకు రావడం ఎంతసేపు అని కౌంటర్ ఇస్తుంది. అప్పుడు డాక్టర్ బాబుని అని పిలుస్తూ ఉంటుంది. ఎలా ఉంది డాక్టర్ బాబు అని అనగానే బాగానే ఉంది వీడున్నాడు కదా అన్ని మర్చిపోవడానికి అని అంటుండగా… అప్పుడు దీప ఈ బాబుతో ఆడుకుంటూ గతం గుర్తు చేసుకుంటూ ఉండండి. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌర్య దగ్గరికి హిమ ఆనంద్ రావు వచ్చి సౌర్య ని ఇంటికి రమ్మని గట్టిగా అడుగుతూ ఉంటారు. అప్పుడు వస్తాను హిమ కానీ నీ మీద కోపం తగ్గాక వస్తాను. ఆ కోపం ఎప్పుడు తగ్గుతుంది తెలుసా.. అమ్మానాన్నలు కనిపించినప్పుడు అని అనగానే.. వాళ్లు అక్కడున్న గాని వస్తారు అమ్మ అని అంటాడు ఆనందరావు. అప్పుడు సౌర్య మీరు అమ్మానాన్నలు లేరనుకుంటున్నారు నేను ఉన్నారనుకుంటున్నాను వాళ్లు కచ్చితంగా నాకు దొరుకుతారు ఆరోజు నేను తప్పకుండా వస్తాను.

మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటుంది. అప్పుడు తిరిగి వెళ్ళిపోతుండగా తాతయ్య అని పిలిచి ఈ పచ్చబొట్టు ఎలా తీసేయాలి తాతయ్య అని అడుగుతుంది.అప్పుడు హిమ, సౌర్యని ఆ పచ్చబొట్టు గనుక చెరిపేస్తే నా మీద ఒట్టే అలాగే ఈ ఇంటిని వదిలేలిన బాగోదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మోనిత కంగారుపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. అప్పుడు మౌనిత ఎక్కడికి వెళ్లావు కార్తీక్ అదేమైనా కనిపించిందా అని అడుగుతుంది. ఎవరు వంట లక్క గురించిన నువ్వు మాట్లాడేది అని అనగానే… అవును అది తప్ప నా ప్రాణాలకు ఇంకెవరున్నారు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నేను నిన్ను ఒకటి అడుగుతాను. అడిగి తీరుతాను సూటిగా సమాధానం చెప్పు అని నా భార్యవి నువ్వా…

ఆ వంటలక్క అని అంటాడు. అప్పుడు మౌనిత నీకేమన్నా మతి పోయిందా ఏం మాట్లాడుతున్నావ్ కార్తీక్ అవును నాకు నిజంగానే మతిపోయింది. నాకేది గుర్తుండదు కదా నువ్వు నా భార్య అని చెప్తే నమ్మేశాను నిన్ను పెళ్లి ఫోటోలు కూడా అడగలేదు నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన కొన్నాళ్లు బాగానే ఉన్నావు. సంతోషంగా ఉన్నాం. ఏ భయము లేకుండా అన్నాం ఈ వంటలక్క నీ చూస్తుంటే ఎందుకు నువ్వు భయపడుతున్నావ్ అసలు ఏమైంది అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు డ్రామా ప్లే చేస్తూ ఏడుస్తూ నీకు మన మధ్య ఏ బంధం లేకుండానే ఇవన్నీ చేస్తున్నానా చివరికి నా బిడ్డను తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన తర్వాత కూడా నన్ను అనుమానిస్తున్నావే నా కర్మ కార్తీక్ అంటూ ఏడుస్తూ డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఏడుస్తున్న కానీ నన్ను ఓదార్చడం లేదు చూడు ఏం చేయాలో తెలియడం లేదు అని అంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది.

కట్ చేస్తే దీప డాక్టర్ అన్నయ్యకి కార్తీక్ గురించి తనకి గతం గుర్తుచేస్తున్నప్పుడు తనకేం జరిగింది. అనే విషయాన్ని చెప్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ గుర్తు చేసుకుంటున్నాడు కాబట్టి అలా అవుతుంది. అప్పుడు దీప ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య అని అంటుండగా.. డాక్టర్ తనని హాస్పిటల్ తీసుకురా తనకేం చేయాలో నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు దీప తప్పకుండా తీసుకొస్తాను అన్నయ్య అని చెప్తుంది. కట్ చేస్తే మౌనిత ఊరికి తీసుకెళ్లాలని ఒక డ్రామా ప్లే చేస్తూ మా మీద అనుమానాలన్నీ పోవాలి అంటే మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు ఏ ఊరికి వెళ్దాం మౌనిక అని అనగానే… నామీద ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయే ఊరు కార్తీక్ అనగానే…

ఇప్పుడు అవన్నీ ఏమీ లేదు మౌనిత అంటుండగా.. మౌనిత తప్పకుండా వెళ్లాలి అని అంటుంది. సరే టిఫిన్ చేసి వెళ్దాం పద అని అంటుండగా.. ఇప్పుడు టిఫిన్ టిఫిన్ ఏమి అవసరం లేదు అని అంటుంది మౌనితా. కట్ చేస్తే శివ మౌనిత కార్తీక్ ఊరు తీసుకెళ్లేది వెళ్లి చెప్తూ ఉంటాడు. అప్పుడు తమ్ముడు ఏ ఊరు వెళ్తున్నారు. తమ్ముడు అని అంటుంది. ఇప్పుడైతే నాకు తెలీదు కానీ అక్క నాకోసం వంట చేసి పెట్టు నేను ఎలాగైనా కనుక్కొని వస్తాను అని అంటాడు శివ. కట్ చేస్తే కార్తీక్ మౌనిత టిఫిన్ చేస్తూ కార్తీక్ మౌని తాని మనం ఏ ఊరికి వెళ్తున్నాం అది ఎన్ని గంటలు పడుతుంది. అని అనగానే.. రెండు గంటలు పడుతుంది దగ్గరే అని అనగానే..

నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు ఇన్ని రోజులు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మళ్లీ ఏడుపు డ్రామా మొదలు పెడుతుంది. అప్పుడు కార్తీక్ తట్టుకోలేక సరే ముందు టిఫిన్ చెయ్ వెళ్దాంలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి శివా వచ్చి మేడం మేడం మీరు చెప్పమన్నట్లుగానే ఆ వంటలక్క కి చెప్పాను మేడం అని అంటాడు. అప్పుడు మౌనిత గుడ్ అని అంటూ… ఇక దానికి పిచ్చెక్కిపోతుంది. చూడు అని మౌని తా సంతోషపడుతుంది. అప్పుడు శివ మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేడం అని అనగానే మౌనిత సీరియస్గా చూస్తుంది. అప్పుడు వద్దులేండి మేడం నాకెందుకులెండి అని శివా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement