Guppedantha Manasu 23 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 23-September-2022 ఎపిసోడ్ 563 ముందుగా మీ కోసం. రిషి కాలేజ్లో పెన్డ్రైవ్ తీసుకొని ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చాక రూమ్లో కూర్చొని పెన్డ్రైవ్ చూస్తూ ఉండగా, అందులో వసుధారాని కిడ్నాప్ చేసింది సాక్షి అని తెలుసుకుంటాడు, దాంతో రిషి కి కోపం వస్తుంది ఈ విషయాన్ని కూడా వసుధార నా నుంచి దాచిపెట్టింది, అసలు నిజంగా నన్ను ప్రేమించిందా అని కోపంతో ఉంటాడు, ఇంతలో ధరణికి యాక్సిడెంట్ జరిగింది అని తెలియడంతో, తనని పలకరిద్దామని ధరని దగ్గరికి వెళతాడు, ఏమైంది వదిన ఎలా జరిగింది అనగానే, ఇదంతా నావల్లే జరిగింది నాకోసం వస్తేనే ఇలా అయింది అని వసుధార అనగానే, అవును నీకోసం ఎవరు వెళ్లినా అలానే జరుగుతుంది అని రిషి కోపంగా అంటాడు. దాంతో ఏమైంది సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అనగానే, నిన్ను ఆరోజు ఎగ్జామ్ రాయకుండా చేయాలని కిడ్నాప్ చేసింది సాక్షి నే కదా ఆ విషయం నీకు తెలుసు అయినా నువ్వు నా దగ్గర్నుంచి దాచిపెట్టావు.
అసలు నిజంగా గురుదక్షిణ కోసమే నన్ను ప్రేమించను అని నటిస్తున్నావా అని రిషి అంటాడు. దాంతో వసుధార చాలా బాధ పడుతుంది. సార్ ఈ విషయం నాకు ముందే తెలుసు నేను వెళ్లి సాక్షిని నిలదీశాను కూడా కానీ తను ఏం చెప్పిందో తెలుసా నిన్ను కిడ్నాప్ చేయించింది దేవయాని మేడమ్ అని చెప్పారు, ఈ విషయం మీకు తెలిస్తే మీరు చాలా బాధ పడతారని నేను చెప్పలేదు సార్ అనగానే, ఇక చాలు వసుధార మా పెద్దమ్మ ఎందుకు కిడ్నాప్ చేస్తుంది నిన్ను అని అనడంతో, అక్కడికి మహేంద్ర వచ్చి ఈ విషయం నాకు కూడా తెలుసు రిషి వసుధార ఎగ్జామ్ రాయకుండా చెయ్యాలి అని ఈ కుట్ర అంత మీ పెద్దమ్మే చేసింది అని తన దగ్గర ఉన్న సాక్ష్యాలతో సహా నిరూపిస్తాడు, వసుధార గురించి సాక్షి, దేవయాని మాట్లాడిన మాటలు, తమ ప్లాను విఫలమైంది ఈసారి పెద్ద ప్లాన్ వేయాలి అని మాట్లాడుతున్న మాటలు అన్నీ వినిపించటంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు.
Guppedantha Manasu 23 September 2022 Episode : దేవయాని నిజస్వరూపం బయట పడనుందా?

ఏంటి పెద్దమ్మ ఇది అనగానే, నిజమే రిషి నేను చేశాను ఈ వసుధార కేవలం గురుదక్షిణ కోసం మాత్రమే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని నాకు తెలుసు, అందుకే నేను ఇలా చెయ్యాల్సి వచ్చింది నాకు తప్పలేదు అని, తన తప్పు లేనట్టుగా రిషి దగ్గర చెపుతుంది. ఇప్పుడు మహేంద్ర కోపంగా ఇక చాలు ఆపండి వదినగారు అసలు మీరే కదా దూరం చేసింది జగతిని రిషిని, ఆరోజు రిషి కోసం జగతి వస్తే, నగలు తీసుకొని వెళ్లింది, నా నగల తొ సహా అని మీరు అబద్ధం చెప్పారు, ఇలా మీరు ఎన్నో చేశారు అసలు జగతిని ఇంటి నుంచి గెంటేసిoది మీరు కానీ, ఈ విషయాలు రిషికి ఎందుకు చెప్పలేదో తెలుసా, మీరు స్వార్థం, మీ ప్రేమ స్వార్థం అని తెలిస్తే రిషి ఏమైపోతాడో అని, కుటుంబ గౌరవం గురించి ఆలోచించి నేను ఇన్ని రోజులు ఆగాను, కానీ ఇప్పుడు మీరు రిషి భవిష్యత్తునే ప్రశ్నిస్తున్నారు, వసుధారని జీవితంలోకి రాకుండా చేయాలని ఎన్ని కుట్రలు పన్నుతున్నారు, నా కొడుకు జీవితంతో ఆడుకుంటే ఇక నేను ఊరుకోను అని ఇలా సమాధానం చెబుతాడు, దేవయాని నిజ స్వరూపాన్ని తెలుసుకున్న రిషి ఏమి చేయనున్నాడు, ఇదంతా నిజమేనా ఎవరైనా కలకంటున్నారా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది.