Karthika Deepam 23 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1465 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత సౌందర్య వాళ్లు వస్తారేమో అని కంగారుపడుతూ ఉంటుంది. దీప ఇంట్లో వస్తువులన్నీ చిందరా బందరా చేస్తూ.. ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ వచ్చి ఏమైందమ్మా దీప ఎందుకు ఏడుస్తున్నావ్ ఏంటి ఇదంతా అని అంటుండగా… దీప జరిగిందంతా చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ నువ్వు రెచ్చిపో నా మోనిత నీ జుట్టు పట్టి ఈడ్చుకొని బయటేసి నీ భర్తని తెచ్చుకో ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తా అని అంటాడు. అప్పుడు దీప ఎవరో అడ్డం వస్తే నేను కూడా ఊరుకోను అన్నయ్య దాని మాటలు వింటూ నా భర్త అడ్డం వస్తాడు అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. అది ఏది చెప్తే అది నమ్మేసి పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు నా భర్త అని అంటుంది.
అప్పుడు డాక్టర్ ఇప్పుడు మన చేతిలో ఉంది ఒకటే అస్త్రం డాక్టర్ బాబుని హాస్పిటల్కి తీసుకురావడం ఒక్కసారి డాక్టర్ బాబు హాస్పిటల్ కి వచ్చాడంటే చాలు మోనిత ఆటలన్నీ కట్టేయొచ్చు. అప్పుడు సరే అన్నయ్య అని కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. ఇక మౌనిత కంగారుపడుతూ ఉండగా… సౌందర్య, ఆనంద్ రావు అక్కడికి వచ్చేస్తారు. వాళ్లని చూసిన మౌనిత షాక్ గురవుతుంది. అప్పుడు మౌనిత శివుని పిలిచి కార్తీక్ ని నేను చెప్పేంతవరకు కనపడకుండా చేయి అని చెప్తుంది. అప్పుడు సౌందర్య ఆనంద్ రావు మౌనిత దగ్గరికి వచ్చి అంతా చూస్తూ ఉంటారు. అప్పుడు మౌనిత కంగారుపడుతూ… ఆంటీ ఎలా ఉన్నారు.. బాగున్నారా. అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు నిన్ను చూస్తుంటే నాకు నమ్మబుద్ధి అవడం లేదు అని సౌందర్య అంటుంది. అంతలో కార్తీక్ హాల్లోకి వచ్చి ఫోన్ వెతుకుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్, సౌందర్యాలను చూసి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళని చూస్తుంటే నాకెందుకో ఏదోలా అనిపిస్తుంది. అని శివతో అంటాడు. కార్తీక్ వాళ్ళ దగ్గరికి మాట్లాడాలి. కలవాలి. అని వస్తుంటే..
Karthika Deepam 23 September Today Episode : మోనితకి వార్నింగ్ ఇచ్చిన దీప…

శివ అక్కడినుంచి తీసుకెళ్లి పోతాడు. అప్పుడు అక్కడికి దీప కూడా వస్తుంది. దీప కార్తీక్ కి వెళ్తూ ఉండగా… ఆనంద్ రావు ఒక్కసారిగా దీప చూసి దీప అని అంటుండగా… మౌనిత ఆగండి అంకుల్ నాక్కూడా కార్తీక్ ఉన్నట్లుగా.. వచ్చినట్లుగా.. అనిపిస్తూ ఉంటుంది. అంతమాత్రాన వాళ్ళు వచ్చేస్తారా అదంతా భ్రమ అని అంటుంది. అప్పుడు సౌందర్య మోనిత గొంతు పట్టుకుని నిజంగానే బ్రమానా లేదా ఏదైనా చేస్తున్నావా అని అంటూ… ఫోన్లో కార్తీక్ అని ఎందుకు అన్నావే అని అంటుండగా.. మౌనిత వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఆనంద్ ని చూపించి తనకి కార్తీక్ అని పేరు పెట్టుకున్నాను అని చెప్తుంది. అప్పుడు సౌందర్య ,ఆనందరావు ఆక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా.. మౌనిత ఆంటీ నా మీద అనుమానం పోయిందా అని అడగగా… అది ఎప్పటికీ జరగదు అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు కార్తీక్ వాళ్ళని కలవాలని వస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు కార్తీక్ వాళ్ళు ఎవరు అని అడగగా..
వాళ్ళు నా కస్టమర్లే కార్తీక్ అని మౌనిత అబద్ధం చెప్తుంది. అంతలో దీప కూడా అక్కడికి వచ్చి ఎవరి వాళ్ళు అని గట్టిగా గొంతు పట్టుకొని అడుగుతుంది… అప్పుడు మౌనిత మీ అత్త మామలుగా వచ్చి కార్తీక్ ఆడిగి వెళుతున్నారు.. నువ్వు ఇప్పుడు వెళ్తావా. వెళ్ళు కారు వెనక పరిగెట్టు అని అంటుంది. ఇక్కడనుంచి పోవే అని మౌనిత అంటుండగా… పోతానే తొందరలో నీ పని చెప్పి నా భర్తను తీసుకొని పోతానే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మౌనిత భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. అమ్మయ్య ఒక గండం తప్పింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే…