Guppedantha Manasu 24 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 24-September-2022 ఎపిసోడ్ 564 ముందుగా మీ కోసం. రిషి దేవయానితో ఒక విషయం చెప్పాలి పెద్దమ్మ, ఎలా చెప్పాలో, ఏం చేయాలో, అర్థం కావట్లేదు అనగానే, చెప్పు నాన్నా రిషి అని దేవయాని అనడంతో, నాకు ఆమెను చూస్తే అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది అనడంతో, దేవయాని లోలోపల సంతోషపడుతుంది, రిషి మాట్లాడేది జగతి గురించి అని సంతోషపడుతుంది, ఇంతలో రిషి చెప్పేస్తాడు, నాకు సాక్షి చేసే పనులు చూస్తే కోపం వస్తుంది, అసలు వసుధారని కిడ్నాప్ చేయించింది, ఎవరో తెలుసా ఈ సాక్షి, సీసీటీవీ ఫుటేజ్ లొ సాక్షి చేసిన పనంతా చూశాను, తను ఇంత నీచానికి దిగజారింది, తన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, మీరే తనని అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పండి అని చెప్పి వెళ్లిపోతాడు, దాంతో దేవయాని షాక్ లో ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
తరువాత మహేంద్ర, రిషి దగ్గరికి వెళతాడు, గుడ్ మార్నింగ్ రిషి అని ఇలా మాట్లాడుతూ ఉండగా, రిషి మీరనుకుంటున్నది జరగదు అని అనడంతో, మహేంద్ర చాలా బాధపడతాడు, అక్కడి నుంచి వెళ్లిపోతుండగా, ఏంటి డాడీ వచ్చారు, ఏం మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు అని అనడంతో, చూడాలనిపించి వచ్చాను అని చెప్పి వెళ్లిపోతాడు, తరువాత జగతి వసుధారతొ ఇలా అంటుంది అంతా ఓకే కదా, వసు నా కారణంగా మీ ఇద్దరి మధ్య గొడవ రాకూడదు మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పటంతో, మీరు టెన్షన్ పడకుండా మేడం అని వసుధార అంటోంది. తరువాత కిచెన్లో జగతి, వసుధార ఇద్దరూ వంట చేస్తూ ఉంటారు, మేడం కూరగాయలు కట్ చేయండి అని చెబుతూ ఉంటుంది, కానీ అప్పుడు అక్కడికి జగతి కాదు, రిషి వస్తాడు, రిషి అని తెలియక జ్యూస్ కూడా చేయండి మేడమ్ అని ఇలా రిషితో పనులు చేపిస్తూ ఉంటుంది.
Guppedantha Manasu 24 September 2022 Episode : గొడవని మరిచిపోయి మళ్ళీ దగ్గరవుతున్న రిషి
మేడం మీతో ఒక మాట చెప్పాలి, ఏ మాటకామాటే సార్ కూడా మీలాగే మల్టీ ట్యాలెంటెడ్ అన్ని పనులూ వచ్చు, కానీ కోపమొక్కటే ఎక్కువ, మేడమ్ రిషి సార్కి నేను దొరకడం లక్కీ కదా అనడంతో అని అంటుంది, అయినా మీరు ఒప్పుకోరు లేండి మేడం నేనే లక్కీ అంటారు అంతే కదా అని ఏదో చెప్పబోతూ, ఏంటి మేడమ్ మీరు ఏమీ మాట్లాడటం లేదు అని ఒక్కసారిగా వెనక్కి తిరిగి సార్ మీరా అని అనడంతో, ఒక్కసారిగా జ్యూస్ రిషి షెట్ మీద పడుతుంది, దానిని వసుధార చున్నీతో తుడుస్తూ ఉంటుంది, ఇలా రొమాంటిక్ సీన్ మొదలవుతుంది, దానిని చూసి దేవయాని చాలా షాక్ అవుతుంది. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది అని, తర్వాత రిషి గదిలోకి వెళతాడు సెట్ని క్లీన్ చేసుకోడానికి, వసుధార కూడా రిషి గదిలోకి వెళుతుంది, సారి సార్ నేను చూసుకోలేదు పొరపాటున వచ్చాను అని అనడంతో, డోర్ నాక్ చేసి అడగొచ్చు కదా అని రిషి అనగానే, మీ షట్ క్లీన్ చేద్దామని పొరపాటున వచ్చాను సార్ అని వసుధార అంటుంది. ఇలా వీళ్లు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.