Guava Benefits : హెల్తీగా ఉండాలంటే పోషికాహారాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. డైట్ లో పండ్లను చేర్చుకోవడం వంటి నియమాలను పాటించాలి. ఒక్కొక్క రకమైన పండ్లలో ఒక్కొక్క ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని పండ్లు సీజనల్గా లభిస్తాయి మరికొన్ని పండ్లు సీజన్తో సంబంధం లేకుండా దొరుకుతాయి. సీజన్లో లభించే పండ్లల్లో జామ పండు ముందంజలో ఉంటుంది. ఈ మొక్కను ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకుంటారు. జామ పండ్లు ను పెద్దల నుండి పిల్లల వరకు అందరూ ఇష్టపడి తింటారు. ఆకుపచ్చ రంగులో ఉండే జామపండు లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నోరూరించే ఈ పండు తియ్యగా ఉంటుంది. వీటి గుజ్జు తెలుపు, గులాబీ రంగులో ఉంటుంది. అయితే చాలామందికి జామపండు తినేటప్పుడు కొన్ని సందేహాలు ఏర్పడతాయి.
గులాబీ రంగు గుజ్జు ఉండే జామ మంచిదా… వైట్ గుజ్జు ఉండే జామ మంచిదా అనే సందేహాలు వెలువడుతాయి. వీటికి ఆసక్తికరమైన సమాధానాలను నిపుణులు తెలియజేశారు. ఈ పండు రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు రుతుస్రావం వల్ల వచ్చే తీవ్రమైన నొప్పిని కూడా తగ్గిస్తుంది. మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలాగా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వివిధ రకాల క్యాన్సర్ కణాలను దూరం చేస్తుంది. ఫాస్పరస్ ,ఐరన్ ,క్యాల్షియం జామ పండ్లలో ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. పింక్ కలర్ జమలో తక్కువ చక్కెర, విటమిన్ సి, ఎక్కువ నీటి శాతం, తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి.
Guava Benefits : వైట్ మరియు పింక్ కలర్ జామకాయలు, ఈ రెండింటిలో ఏది మంచిదంటే.

తెల్లజామాలు విటమిన్ సి ,స్టార్స్, ఎక్కువ చక్కెర , గింజలు ఎక్కువగా ఉంటాయి. ఎరుపు రంగులో ఉండే జామలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది, తెలుపు రంగులో ఉండే జామలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కెరోటి నాయుడు పదార్థం పింక్ కలర్ జామలో సహజంగా ఉంటుంది. వీటిలో ఆమ్లాలు డైటరీ ఫైబర్, విటమిన్ ఏ,సి ఒమేగా 3, అసంతృప్తి కొవ్వు, ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రయోజనాకరంగా ఉంటుంది. జామ పండ్లను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా నాణ్యతను పరిశీలించాలి. జామలో పచ్చిజామ, గట్టి జామ, దేశి జామ మొదలైన రకాలుగా కలితీలు జరుగుతాయి. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా కొనుగోలు చేయాలి.