Guppedantha Manasu 26 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 26-September-2022 ఎపిసోడ్ 565 ముందుగా మీ కోసం. రిషి వసుధారని ఒక ప్రదేశానికి పిలుస్తాడు, వసుధార వెయిట్ చేస్తూ వుంటుంది, రిషి వస్తాడు సారే ఇక్కడికి పిలిచారు ఈ ప్లేస్ కి అని అనగానే, నీకు ప్రకృతి అంటే చాలా ఇష్టం కదా, ఈ ప్లేస్ లో నీతో మాట్లాడాలని పిలిపించాను అని అనడంతో, వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది రిషి సార్ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు అనీ, కొత్తగా మాట్లాడుతున్నాను ఏంటి అని అనుకుంటున్నావా అని రిషి అంటాడు, అందరూ నన్ను దూరం పెడుతున్న నేను ఓర్చుకున్నాను, కానీ నువ్వు కూడా అలానే చేశావు అని అంటాడు, నేనేం చేశాను సార్ అని వసుధార ఆడటంతో, తన మొబైల్లో వీడియో ని చూపిస్తూ ఉంటాడు, సాక్షి కిడ్నాప్ చేసిన వీడియో ని, ఎందుకు నా దగ్గర దాచావు అని ప్రశ్నిస్తాడు వసుధారని, ఇంత జరిగాక కూడా నా దగ్గర ఈ విషయాన్ని దాస్తావా అని అనడంతో, కారణం ఉంది సార్ అని వసుధార అంటుంది.
నువ్వు నా దగ్గర ఈ విషయాన్ని దాచావు, దాపరికాలు ఉంటాయా ఇది మోసం అవుతుంది కదా అని ప్రశ్న ప్రశ్నిస్తాడు రిషి, అందరి మంచికోసమే నేను చెప్పలేదు సార్ సాక్షి మీద కోపంతో మీరెలా ప్రవర్తిస్తారో తెలీదు, అందుకే భయంతో చెప్పలేదు అనగానే, నీకేమయినా అయితే నేనంత భయపడతాను, నీకు తేలియాద అయినా అసలు ఈ దాపరికాలు ఏంటి వసుధార అని, అసలు ఇది ప్రేమేనా, నేను జగతి మేడం కొడుకుని కాబట్టి నన్ను ప్రేమించావా, ఒప్పందాలు, పథకాలు వేసుకొని ప్రేమించవా నన్ను అని ప్రశ్నిస్తాడు, దాంతో వసుధార మనసు ముక్కలవుతుంది, సార్ ఎటువంటి పతకాలు నా దగ్గర లేవు, నేను నిజంగానే ప్రేమించాను నన్ను అర్ధం చేసుకోండి సార్ అని అనడంతో, అస్సలు అన్నీ దాచిపెడుతున్నావు, ఏంటి వసుధార అని ప్రశ్నించడంతో, సార్ మీకు నేను చెప్పాను కదా కారణం ఉంది అని, మీరు ఏం చేస్తారన్న భయంతో చెప్పలేదు సార్, అని అనడంతో, నాకు కోపం ఎక్కువే వసుధార కాని నేను కోపాన్ని అనవసరంగా చూపించను.
Guppedantha Manasu 26 September 2022 Episode : నువ్వు నా దగ్గర ఈ విషయాన్ని దాచావు

కోపంతో ప్రేమను వదులుకోలేను, ఈ రిషెoద్రభూషణ్ నిన్ను ప్రేమించాడు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. ఇక మీదట మన మధ్య ఇలాంటి డిస్కర్షన్స్ మళ్లీ రాకూడదు అని చెప్పి వెళతారు. కారు దగ్గరికి వెళ్లి కూర్చుంటారు, ఇంతలో పూలమ్మే ఆవిడ వస్తుంది, తీసుకోండి బాబు పూలు బోణీ అవ్వలేదు అని అనడంతో, రిషి ఆలోచిస్తూ ఉంటాడు, తీసుకోమని చెప్పొచ్చు కదా వసుధార అని అనుకుంటూ ఉంటాడు రిషి. మనసులో తీసుకోవచ్చు కదా రిషి సార్ అని అనుకుంటు ఉంటుంది. పూలను తీసుకొని వసుధార కి ఇస్తాడు, నీ ఆలోచనలని కాదన్నాను, నిన్ను కాదు, ఈ రిషెoద్రభూషణ్ ఎప్పుడు నీ కోసం నువ్వు వచ్చె దారిలో ఎదురుచూస్తూనే ఉంటాడు అని చెప్పడంతో, వసుధార సంతోషపడుతుంది, రూమ్ కి వెళ్లాక పూలని లవ్ సినిమాల్లాగా పేర్చి రిషి కి ఫొటో పెడుతూ ఉంటుంది.
దానిని చూసి రిషి ఫోన్ చేస్తాడు ఏంటి వసుధార, ఏం చేస్తున్నావ్, ఏంటి ఇదంతా అని అంటాడు, నువ్వు నిజంగానే నాకోసం వస్తాయి ఈ ఇంటికి అని రిషి అడగ్గానే, వసుధార సైలెంటుగా ఉంటుంది, అయితే ఇంకా డిసైడ్ చేసుకోలేదు అన మాట అని రిషి ఫోన్ పెట్టేస్తాడు, తరువాత జగతి వస్తుంది, రిషి లోపలికి రావచ్చా అని అనగానే, రండి మేడమ్ అని అంటాడు, నీతో కొద్దిగా మాట్లాడాలి, బంధాలు చాలా సున్నితమైనవి వాటిని పోగొట్టుకోవద్దు రిషి, వసుధరతో నీ బంధాన్ని పోగొట్టుకోకు అని అనడం తో, బంధం నిలబడడమనేది తన చేతుల్లోనే ఉంది మేడమ్ అని అంటాడు, నీకు వసుధార చాలా ముఖ్యం కదా రిషి అని అనగానే, తనకి కూడా బాధ్యత ఉంటుంది కదా మేడమ్ అని రిషి మాట్లాడుతూ ఉంటాడు, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.