Guppedantha Manasu 29 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 29-September-2022 ఎపిసోడ్ 568 ముందుగా మీ కోసం. రిషి కాలేజ్ వెళతాడు, రిషి వెనకాలే వసుధార కూడా వెళుతుంది, చేతికి కట్టు కడుతుoది, వెళ్ళిపో ఇకటి నుంచి అన్నా కూడా వినకుండా, మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాను సార్ అని మొండిగా ఉంటుంది, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అనగానే, లేదు సార్ ప్రేమ నేను మీరు వేర్వేరు కాదు సార్, ఎప్పుడో ఒక్కటయ్యాం, మీరిక్కడుంటే నేనిక్కడే ఉంటాను అని ఇలా మాట్లాడుతూ ఉంటుంది, రిషి క్యాబ్ను బుక్ చేస్తాడు వసుధార కోసం, వెళ్లు అని చెప్పి తను కూడా కాలేజీ నుంచి బయలుదేరుతాడు ఇంటికి, ఒకవైపు ఇంట్లో జగతి, మహేంద్ర టెన్షన్ పడుతూ ఉంటారు రిషి కోసం, ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది, అక్కయ్య ఒక్కసారి ఫోన్ చేయ౦డి రిషి ఇంకా రాలేదు అని అడుగుతుంది, ఏంటి జగతి నీ స్వభావానికి విరుద్ధంగా చేస్తున్నావు, ఆయన నువ్వు ఫోన్ చేయామని చెప్పగానే నేను చేస్తాన అని దేవయాని అంటోంది, అప్పుడు మహేంద్ర ఎందుకు నువ్వు జరగనిది అడుగుతున్నావు, ఎందుకు బతిమలాడుతున్నావు అని మహేంద్ర అంటాడు, ఇలా వీళ్ళు కొద్దిసేపు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంతలో ధరణి వచ్చి నేను చేస్తాను అత్తయ్య అనగానే, నేను చేయనని చెప్పాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు అని ధరణిని దేవయాని తిడుతుంది, ఇంతలో రిషి కూడా అక్కడికి వస్తాడు, చేతికి గాయం అవ్వడం తో దేవయాని వెళ్లి ఏమైంది రిషి అనగానే, చేతికి గాజు రాసుకుంది, నాకేం కాలేదు, మీరు వెళ్ళండి నన్ను ఒంటరిగా వదిలేయండి అనడంతో, అందరూ వెళ్లిపోతారు, దేవయాని మనసులో అనుకుంటు ఉంటుంది, ఏం జరిగిందో కొద్దిసేపయ్యాక వెళ్లాలి అని, ఇంతలో రిషి గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు, నేరుగా వసుధార సరాసరి రిషి రూంలోకి వెళుతుంది, దేవయాని చూసి షాక్ అవుతుంది, వసుధార రిషి ని తిన్నారా సార్, నొప్పి ఏమైనా వుందా అని అడుగుతూ ఉంటుంది, ఇదంతా రిషి ఊహా ఏమో అనుకుంటాడు కానీ, ఇంకా మాయం అవ్వటం లేదు అని, నవ్వు మాయమై పోలేదు ఏంటి వసుధార అని అంటాడు, వసుధార నిజంగానే వచ్చాను సార్ అని అంటోంది, ఈ టైమ్లో వచ్చావేంటి అనగానే, రావాలనిపించింది సార్ అని అంటోంది, ఇంతలో దేవయాని జగతిని పిలుచుకొని, భోజనం తీసుకొని రిషి దగ్గరి కి వస్తారు, తిను నాన్నా అని అడుగుతుంది, ఎంత అడిగినా నాకు తినాలని లేదు అని రిషి అంటాడు.
Guppedantha Manasu 29 September 2022 Episode : వసుధార లను కలిపే ప్రయత్నంలో మహేంద్ర

అప్పుడు వసుధార ప్లేట్ తీసుకుని ఏంటి సార్ మీరు తినండి, ఎలా తినరొ నేనూ చూస్తాను అని తనే స్వయంగా తినిపిస్తూ ఉంటుంది, అందరూ చూసి షాక్ అవుతారు, ఏంటి వసుధార ఎప్పుడు లేనిది కొత్తగా ప్రవర్తిస్తుంది అని దేవయాని చూసి షాక్ అవుతున్నారు, ఇంట్లో వాళ్లందరూ సంతోషపడతారు, మహేంద్ర గౌతమ్ తొ మనం రిషికి టాబ్లెట్ తీసుకుని వద్దాం అని, అందరూ అక్కడ్నించి వెళతారు, దేవయాని కూడా వెళుతుంది, వసుధార రిషికి అన్నం తినిపించి, ట్యాబ్లెట్ వేసుకొని పడుకోండి సార్, మీరు జాగ్రత్త, మీ కోపాన్ని ఆకలి మీద చూపించకండి అంటూ ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ వెళ్లిపోతూ ఉంటుంది, ఒకవైపు జగతి మహేంద్ర గౌతమ్ ముగ్గురూ కలిసి వసుధార, రిషి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, ఎలాగైనా వాళ్ళని ఒకటి చెయ్యాలి అని కొత్తగా ప్లాన్ చేస్తూ ఉంటారు, కాలేజ్లో వాళ్లను కలిసే లాగా చెయ్యాలి అని మహేంద్ర మిషన్ రిషిధార అని ప్లాన్ తో స్టార్ట్ చేద్దాం అంటూ, కొత్తగా ఐడియాని వాళ్లతో చెబుతూ ఉంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.