Guppedantha Manasu 3 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 3-September-2022 ఎపిసోడ్ 546 ముందుగా మీ కోసం వసుధార ఎగ్జామ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. రిషి మనసులో దటీజ్ వసుధార అని అనుకుంటూ ఉంటాడు. వసుధార ఎగ్జామ్ పూర్తిచేస్తుంది. తరువాత జగతి, మహేంద్ర, గౌతమ్ క్యాంటీన్ కి వెళతారు.ఇంతలో గౌతమికి ఫోనొస్తే మాట్లాడ్డానికి వెళతాడు. జగతి, మహేంద్ర ఇద్దరూ ఏం జరిగిందా అని వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.అప్పుడు జగతి అంటోంది, సాక్షి ఎందుకో రిషిని వదిలిపెట్టింది అని అనిపించడం లేదు, ఏదో జరిగింది మహేంద్ర అని, ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లకి పెళ్లి చెయ్యాలి అని మహేంద్ర అంటాడు. ఇలా ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా, గౌతమ్ వచ్చి, అంకుల్ నాకు ఒకటి అనిపిస్తుంది. రిషికి వసుధారకి పెళ్ళి చెయ్యాలి అని గౌతమ్ కూడా వచ్చి అదే మాట్లాడుతాడు. ఇలా మాట్లాడుతూ ఉంటారు కొద్దిసేపు. క్యాంటీన్ లో వసుధార ఇంకా రాలేదా అని అడుగుతారు.
Guppedantha Manasu 3 September 2022 Episode : స్టోర్ రూమ్ లో నువ్వు ఎలా పడిపోయావు అని వసుధార ని ప్రశ్నించిన రిషి, వసుధార సమాధానం ఏంటి?
ఇవాళ రానని చెప్పింది అని అనడంతో, అదేంటి అంకుల్ వసుధార రాలేదు, రిషి లేడు అంటే ఏంటో అర్థం అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఒకవైపు వసుధార సంతోషంగా ఒప్పుల కుప్ప వయ్యారి భామ అనే ఆట ఆడుతూ ఉంటుంది, చిన్నబాబుతో కలిసి, రిషి రాగానే, సార్ అని రిషి ని కూడా పట్టుకొని, తిప్పుతూ ఉంటే, ఏంటి ఇదంతా వసుధార అని అనగానే, సార్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, అందుకే ఈ ఆట ఆడుతున్నాను అని అంటుంది.అప్పుడు రిషి, వసుధార ని అడుగుతాడు. ఎవరు వసుధార నిన్ను కిడ్నాప్ చేసింది అని, అప్పుడు వసుధార మనసులో నాకు సాక్షి మీద అనుమానం ఉంది. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను సార్, ఈ సమస్య నేనే పరిష్కరించుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది మనసులో. సార్ నేను ఆ విషయం గురించి మర్చిపోదామనుకుంటున్నాను సార్ అని అనగానే, రిషి నిన్ను ఇబ్బంది పెడుదామని అనుకోలేదు, ఏం జరిగిందో తెలుసుకుందామని అడిగాను వసుధార అని, సరే పద బయటకు వెళదాం అని తీసుకెళ్లతాడు.

ఒకవైపు మహేంద్ర రిషి, వసుధార ఫోటోలను చూస్తూ జగతి తో మాట్లాడుతూ ఉంటాడు.వాళ్ళ పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉండగా, గౌతమ్ వస్తాడు, ఇంతలో ధరణి వస్తుంది. అందరూ వాళ్ల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.జగతి ఆపుతుంది బయటికి వెళ్లకుండా వాళ్ళని, ప్రశాంతంగా ఉండనివ్వండి. వాళ్ళని ఇప్పుడే అడగకూడదు అని, అందరికీ నచ్చజెపుతుంది జగతి. ఇలా వీళ్లు సరదాగా మాట్లాడుతూ ఉండటాన్ని దేవయాని చుాసి, ఇంత నవ్వుకుంటూ ఉంటారా, చెబుతాను మీ పని అని కోపంగా అనుకుంటు ఉంటుంది.ఇంతలో సాక్షి ఫోన్ చేస్తుంది. జరిగిన దాని గురించి కొద్దిసేపు దేవయాని ప్రశ్నిస్తూ ఉంటుంది సాక్షిని.అంటీ మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు, రిషి వసుధార ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, క్షణాల్లో ఆ ప్రేమను, ద్వేషంగా మార్చొచ్చు అని అంటుంది. చేసెది ఏదొ త్వరగా చేయి అని, ఫోన్ పెట్టేసింది దేవయాని.తరువాత సాక్షి మనసులో నాకు దక్కనిది ఎవరికీ దక్కకుండా చేస్తాను అని అనుకుంటూ ఉంటోంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.