Cumin water : సహజంగా ప్రతి ఇంట్లో నిత్యము చేసుకునే వంటలలో వాడుకునే దినుసులలో ఒకటి జీలకర్ర. నిత్యము దీనిని వంటల్లో వాడుతూ ఉంటాం. ఇది ఆహారానికి ఎంతో అద్భుతమైన టేస్ట్ ని ఇవ్వడమే కాకుండా. ఆరోగ్యానికి ఎంతో మేలు కలగజేస్తుంది. ఈ జీలకర్రలో మినరల్స్, సాల్ట్, యాంటీ ఆక్సిడెంట్ ,యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జీలకర్ర జీ అన్న సంబంధిత సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే నిత్యము ఈ జిలకర నీటిని సేవించినట్లయితే మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ నీటిని ఉదయం పరిగడుపున తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని తెలియజేస్తున్నారు.. ఎటువంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Cumin water : ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
గర్భిణీ మహిళలకు సహాయపడుతుంది:
జిలకర నీటిని గర్భవతులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీలకర్రలో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్లు జీర్ణ క్రియ కు కావాల్సినంత ఎంజైములను అందిస్తుంది. గర్భధారణ టైంలో ఎదుర్కొనే కొన్ని సమస్యలను దూరం చేయడంలో ఈ జీరా వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది

పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది: బాలింతలు ఈ జీలకర్ర నీటిని తాగినట్లయితే పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది జీలకర్రలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనత నుండి రక్షిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఈ జీరా వాటర్ లో ఫైబర్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది.
వర్షాకాలంలో జీరా వాటర్ తీసుకున్నట్లయితే ఎన్నో వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.
షుగర్ వ్యాధికి చెక్:
షుగర్ బాధితులకు ఈ జీరా వాటర్ మేలు చేస్తాయి. నిత్యము పరిగడుపున ఈ నీటిని తీసుకోవడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అలాగే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి;
ఈ జీరా వాటర్ ను తీసుకున్నట్లయితే కడుపుబ్బరం, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ జిలకరలో యాంటీ ఇన్ప్లమెంటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి కడుపు నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ నీటిని తీసుకోవడం వల్ల గట్
సమస్యలు కూడా తగ్గిపోతాయి.
అలాగే శ్వాసకోశ వ్యవస్థకి సానుకూలత ప్రభావం చూపుతుంది. చాతిలో పేరుకుపోయిన శ్లేస్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.