Guppedantha Manasu 4 July Today Episode : జగతి, మహేంద్ర ఇంటికి రాగానే దేవయాని కాలేజీలో జరిగిన సన్మానం గురించి వెటకారంగా మాట్లాడుతుంది. జగతిని నీ స్టూడెంట్ ఇలా అందరి ముందు దండ వేయడం కరెక్టా అని అడుగుతుంది దానికి జగతి దేవయానితో దండ వేసింది వసుధార, వేయించుకుంది రిషి వాళ్ళను అడగండి ఏదైనా ఉంటే అని అంటుంది. ఇంతలో గౌతమ్ ఇంటికి వస్తాడు, దేవయాని గౌతమ్ ని రిషి ఎక్కడ ఇంటికి రాలేదు అని అడుగుతుంది. అప్పుడు గౌతమ్ నేను బైక్ మీద వచ్చాను పెద్దమ్మ రిషి కార్ లో వస్తున్నాడు అని అంటాడు. ఇంతలో రిషి కూడా ఇంటికి వస్తాడు, గౌతమ్ రిషితో పెద్దమ్మ నీ గురించే అడుగుతుంది రిషి ఇలా రా అని పిలుస్తాడు. దేవయాని అమాయకంగా రిషితో వీళ్లంతా దండ వేయడం గురించి మాట్లాడుతున్నారు అని వాళ్లపై చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది, రిషి ఫీల్ అయ్యేలా దేవయాని మాట్లాడుతుంది.
రిషి ఏంటి ఇది ఏదైనా పెద్ద విషయమ దీని గురించి చర్చిస్తున్నారు అని అంటాడు మహేంద్ర తో, ఇలా చర్చించడం నాకు నచ్చలేదు, దీని గురించి అందరూ మర్చిపోండి అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత జగతి దేవయాని ఒకరివైపు ఒకరు కోపంగా చూసుకుంటూ లోపలికి వెళ్లి పోతారు. మహేంద్ర బయటకు వచ్చి కారులో వసుధార వేసిన ఆ దండును చూసి రిషి నీ మనసులో ఏముందో ఏంటో అని తనలో తాను అనుకుంటాడు. తర్వాత గౌతమ్, వసుధార తో ఫోన్లో మాట్లాడుతుంటాడు. వసుధార ని పొగుడుతూ రిషి దగ్గరికి వస్తాడు గౌతమ్, రిషి ఎవ్వరు ఫోన్లో అని అడిగితే నాకు తెలిసిన వారే మాట్లాడు రిషి అని, ఫోన్ రిషికి ఇస్తాడు గౌతమ్. రిషి హలో ఎవరండి అని అంటాడు దాంతో వసుధార నేనే అని అనగానే రిషి గౌతమ్ తో వసధారతోనే గా మాట్లాడుతుంది చెప్పొచ్చు కదా అని అంటాడు.

గౌతమ్ రిషితో వసుధార దండ ఎందుకు వేసిందో తెలుసుకుందాం అని ఫోన్ చేశాను అంటాడు అలా సంభాషణ జరుగుతుంది. అలా రిషి వసుధార ఇద్దరు కాలేజీలో జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తుంటారు. గౌతమ్ ఏమో వసుధార ప్రేమతోనే అలా చేస్తుందేమో అని రిషితో అంటాడు. కానీ రిషి అంతా భ్రమ అని అంటూ ఫీల్ అవుతాడు. అలా రిషి వసుధార రిజెక్ట్ చేసినదాన్ని గుర్తుచేసుకుంటూ చాలా బాధపడతాడు. వసుధార ఏమో రిషి సార్ కోపం తగ్గేలా చెయ్యాలి అని అనుకుంటుంది. తెల్లవారగానే కార్ డ్రైవర్ పూలదండను లోపలికి తీసుకొస్తాడు దేవయాని దానిని చూసి చెత్త బయట పడేసేయ్ అని అంటుంది. జగతి వచ్చి పూలదండను తీసుకుంటుంది, దేవయాని జగతితో ఇది ఏం చేసుకుంటావు ఎందుకు అని అంటోంది. ఇది ఒక జ్ఞాపకం అని జగతి అంటుంది. నా కొడుకు గౌరవం ఈ దండ అని చెబుతుంది. అలా ఒకరికి ఒకరు మాటలు విసురుకుంటారు. ఇంతలో మహేంద్ర జగతి కి సపోర్ట్ చేసి మాట్లాడతాడు, అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రిషి వస్తాడు.
Guppedantha Manasu 4 July Today Episode : జగతి దేవయాని మధ్య సంభాషణ.
ఈ దండ ఏంటి అంటే జగతి తెలివిగా దండ చెత్తకుప్పలో వేయడానికి అనగానే, రిషి కోపంగా చెత్తలో వేయడం ఏంటి ఆ దండ నా జ్ఞాపకం ఇలా ఇవ్వండి అని తీసుకెళ్తాడు. తర్వాత జగతి దేవయాని మధ్య సంభాషణ జరుగుతుంది. దేవయాని మనస్సులో రిషి నా అదుపుతప్పి పోతున్నాడు అని, ఎలాగైనా కంట్రోల్ చేయాలి అని అనుకుంటుంది. రిషి జ్ఞాపకం విలువ నీ వాళ్ళనే తెలిసింది వసుధార, ఇది నీ జ్ఞాపకం నా దగ్గరే ఉంచుకుంటా అని దండును చూసి అనుకుంటాడు. వసుధార కాలేజ్ లోపలికి వెళుతుండగా సాక్షి వస్తుంది. దారికి అడ్డంగా ఉండకూడదని తెలీదా అని అంటుంది, దాంతో నా దారిలోకి నువ్వు వస్తున్నావు అని వసుధార సాక్షి తో అంటుంది. వసుధార సాక్షితో నువ్వు రాంగ్ రూట్లో వెళుతున్నావు అది తప్పు అని చెబుతుంది, రాంగ్ రూట్లో వెళ్లినా సరే నేను అనుకున్నది సాధిస్తానని సాక్షి అంటుంది.