Guppedantha Manasu 4 September 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 547 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రిషి, నువ్వు అలా ఎలా పడిపోయావు అసలు నీకు ఏం జరిగింది. అని అడుగుతూ ఉంటాడు. వసుధరా ని కానీ వసుధార రిషి సారికి చెప్పడం వలన ఆవేశంలో సాక్షిని ఏదైనా చేస్తాడు.. అని తను చెప్పకుండా ఆగిపోతుంది. కట్ చేస్తే జగతి, గౌతం, ధరణి, మహేంద్ర, రిషి, వసుధారాల పెళ్లి విషయంపై మాట్లాడుతూ ఉంటారు. వాళ్లని కాఫీ షాప్ కి పిలిచి కూర్చోబెట్టి పెళ్లి గురించి మాట్లాడాలి అని గౌతమ్, మహేంద్ర ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ జగతి ఇప్పుడే వద్దు అని వాళ్ళని ఆపుతుంది. ఇదంతా చూస్తున్న దేవయాని మండి పడిపోతూ ఉంటుంది. అంతలో సాక్షి దేవయానికి ఫోన్ చేస్తుంది.
Guppedantha Manasu 4 September 2022 Episode : రిషి, వసుధారాలని పెళ్లి చేయాలి అని చూస్తున్న మహేంద్ర…
దేవయాని సాక్షిని నువ్వు ఏది చెప్పినా సరిగా చేయవు అని తిడుతూ… రిషి ని నీ చేతులారా నువ్వే దూరం చేసుకుంటున్నావు అంటూ.. నాకు కొంచెం చిరాగ్గా ఉంది ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడను తర్వాత మాట్లాడతాను అని పెట్టేస్తుంది. కట్ చేస్తే సాక్షి రిషి కి దగ్గర ఆవ్వడానికి చూస్తూ ఉంటుంది. రిషి, వసుధార ఎగ్జామ్స్ అయిపోవడంతో సరదాగా పార్కులు వెంట తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదంతా తెలిసిన సాక్షి ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడగొట్టాలి. అని ప్లాన్లు గీస్తూ ఉంటుంది. కట్ చేస్తే మహేంద్ర, గౌతమ్ కాఫీ షాప్ కి వెళ్తారు. అక్కడికి వెళ్లి రిషిని వసుధార ని రమ్మని చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడికి వస్తారు. అప్పుడు మహేంద్ర రిషి వసుదరాల ఫోటోలను చూపిస్తూ వాళ్ల పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ రిషి సిగ్గుపడుతూ మాట దాటేస్తూ ఉంటాడు.

జగతి వసుధారతో మాట్లాడుతూ ఉంటుంది. వసుధార, రిషి గురించి జగతికి చెప్తూ ఉంటుంది. గౌతమ్ మహేంద్ర, రిషి ని ఆటపట్టిస్తూ ఉంటారు. దేవయాని సాక్షికి ఫోన్ చేసి నువ్వేం చేస్తున్నావ్ వాళ్ళిద్దరు ప్రేమ పెళ్లి దాకా వస్తుంది. జగతి మహేంద్ర గౌతమ్ వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్లారు వాళ్లకి చెప్పేస్తారు. రిషి ఓకే అంటాడు ఇక అంతా అయిపోతుంది అని దేవయాని అంటూ సాక్షిని తిడుతూ ఉంటుంది. అప్పుడు సాక్షి అప్పుడు ఆంటీ నేను అదే పనిలో ఉన్నాను… ఈసారి నేను చేసే ప్లాను పక్కాగా ఉంటుంది వసుధారాన్ని దూరం చేస్తా అని సాక్షి అంటుంది. దేవయానికి ఆ ప్లాన్ అంతా చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…