Guppedantha Manasu 5 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 5-September-2022 ఎపిసోడ్ 547 ముందుగా మీ కోసం. వసుధార ఎగ్జామ్స్ అయిపోయాయి అన్న సంతోషంలో ఒప్పులకుప్ప వయ్యారిభామ అనే ఆట ఆడుతూ ఉంటుంది. ఇంతలో రిషి వసుధార దగ్గరికి వస్తాడు.నువ్వు స్టోర్రూమ్లో ఎందుకు ఉన్నావు వసుధార దానికి కారణం ఎవరు అని అడగ్గానే, నాకు గుర్తు లేదు సార్ అని చెబుతోంది. మీరు దానిని గుర్తు చేయకండి సార్ నేను మార్చుకోవాలనుకుంటున్నాను అని అనగానే, సారీ వసుధార అని చెప్పి పద వెళదాం అని అంటాడు.ఎగ్జామ్ కి ముందురోజు వసుధార రిషి మిసెస్ చేసుకుంటూ ఉంటారు. అందులో ఎగ్జామ్ అయిపోగానే ఇంకేంటి వసుధార అని రిషి అడగ్గానే, లాంగ్ డ్రైవ్కి వెళ్లడమే సార్ అని వసుధార అన్న మాటల్ని గుర్తు పెట్టుకొని, రిషి తనని లాంగ్ డ్రైవ్కి తీసుకొని వెళతాడు.
ఒకవైపు గౌతమ్, మహేంద్ర రిషి వసుధార ఫోటోలని చుస్తూ ఈ ఫొటో అయితే వెడ్డింగ్ కార్డు లొ బాగుంటుంది కదా అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జగతి మీరు తొందరపడకండి అని అంటూ ఉంటుంది.ఇలా గౌతమ్, మహేంద్ర, ధరణి వీళ్లందరూ రిషి వసుధర పెళ్లి గురించి ప్లాన్స్ వేస్తూ ఉంటారు, ముందుకు ఎలా తీసుకువెళ్లాలి అని.దానిని చూసిన దేవయాని రగిలిపోతూ, సాక్షిని తిడుతూ ఉంటుంది. వాళ్లని నువ్వేమి చెయ్యలేకపోయావు, ప్రతిసారీ నీ ప్లాన్ ఫెయిల్ అవుతూ వస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు సాక్షి, ఈసారి నేను వేసిన ప్లాన్ మామూలుగా ఉండదు. ఖచ్చితంగా వాళ్లు విడిపోతారు. ప్లాన్ ఫెయిల్ అవ్వడం అనే మాటే ఉండదు మీరే చూస్తారు కదా అని స్ట్రాంగ్ గా చెబుతూ ఉంటుంది, దేవయానికి సాక్షి.రిషి వసుధార ని లాంగ్ డ్రైవ్కి తీసుకెళతాడు.
Guppedantha Manasu 5 September 2022 Episode : వసుధార ని లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్లి, ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నాడు రిషి?

అక్కడ ఒక ప్లేస్ దగ్గర కార్ ని ఆపుతాడు. ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. పచ్చని పొలాలతో, నదుల తోనూ చాలా అందంగా ఉంటుంది, వసుధార కార్ దిగి చాలా సంతోషపడుతుoది, ఆ ప్లేస్ ని చూసి,రిషి వసుధార వెనుక ఉండి రెడ్రోజ్ బొకే ని పట్టుకొని వస్తాడు.వసుధార కి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు వసుధార సార్ ఈ రోస్ అన్నీ నా కోసమేనా అని అనగానే, ప్రశ్నలన్నీటికీ టకాటకా మణి సమాధానం చెప్పు, ఇవన్నీ నీకే అని అంటాడు రిషి.దాంతో వసుధార ఆలోచిస్తూ ఉంటుంది సార్ ఏమీ అడుగుతాడు అని.ఒకవైపు గౌతమ్ మహేంద్రతో అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ అంకుల్ అని అంటాడు.సాక్షి ఈసారి ఏ కుట్ర చేయబోతుంది. వసుధార ని రిషి ఏ ప్రశ్నలు అడగబోతున్నాడొ తెలుసు కోవడానికి, రేపటి ఎపిసోడ్ ను మిస్ చేయకండి.