Health Tips : కూరగాయలు ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. క్యాలీఫ్లవర్ ని చాలామంది ఇష్టంగా తింటుంటారు. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. క్యాలీఫ్లవర్ ఎక్కువ పోషకాల గుణాలను కలిగి ఉంది. దీనితోపాటు విటమిన్లు, ప్రోటీన్లు, క్యాల్షియం, పొటాషియం, ఐరన్ కార్బోహైడ్రేట్లు ,ఫాస్ఫరస్ వంటి పోషకాలు శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనితోపాటు క్యాబేజీలో విటమిన్ ఏ, బి ,సి పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. క్యాబేజీ ఆరోగ్యానికి మంచిదే అయిన. కానీ క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల కొందరి ఆరోగ్యానికి హాని జరుగుతుంది.
Health Tips : క్యాలీఫ్లవర్ ని అతిగా తింటున్నారా… అయితే ఇటువంటి సమస్యలతో బాధపడేవారు
కొంతమందికి కాలీఫ్లవర్ తినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తులు క్యాలీఫ్లవర్ కు దూరంగా ఉండాలి. అయితే క్యాలీఫ్లవర్ తినడం వల్ల వారికి ఎలాంటి హాని జరుగుతుందో తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ కి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. దీన్ని తీసుకోవడం వల్ల మీ T3 , T4 హార్మోన్లు పెరుగుతాయి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు క్యాలీఫ్లవర్ ని ఎక్కువగా తీసుకోకూడదు. దీనిలో రాఫీ నోస్ ఉంటుంది. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది శరీరంలో త్వరగా జీర్ణం కాదు.

తద్వారా క్యాలీఫ్లవర్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ యాసిరిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు క్యాలీఫ్లవర్ ని తినకూడదు. క్యాబేజీలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ క్యాలీఫ్లవర్ ని తినడం అంత మంచిది కాదు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం ద్వారా మూత్రపిండాల సమస్య వేగంగా పెరుగుతుంది. దీనితోపాటు యూరిక్ యాసిడ్ స్థాయి కూడా అధికంగా పెరుగుతుంది. కాబట్టి థైరాయిడ్, కిడ్నీలో రాళ్లు సమస్యలు ఉన్నవారు క్యాబేజీకి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.