Guppedantha Manasu 9 August Today Episode 524 : గుప్పెడంత మనసు సీరియల్ 9-Aug-2022(524) ఎపిసోడ్ ముందుగా మీ కోసం…… వసుధార ఉన్నా రెస్టారెంట్‌కి రిషి వస్తాడు. ఇద్దరు కూర్చుంటారు.రమ్మన్నావు వస్తే ఏం మాట్లాడవేంటీ అని రిషి అడుగుతాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్ అని వసుదార చెప్తుంది. పర్లేదు నువు చెపు స్పీచులో ఏదో ఒక జ్ఞానబోధ ఉంటుంది నేను అర్ధం చేసుకుంటాను చెప్పు అని రిషి అంటాడు.రిషి సార్ నాకొక లక్ష్యం ఉంది నేను ఆ దిశగానే వెళ్తాను నేను గెలుస్తానో గెలవనొ తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కానీ మనకు ఇష్టమైన పని చేస్తే అందులో ఆనందం ఉంటుంది కదా సార్ అని అంటోంది వసుదార.మీరు తీసుకున్న నిర్ణయం మార్చుకోండి సార్ అని వసుధార చెప్తుంది రిషితో.కొన్ని కొన్ని నిర్ణయాలు మనకి తెలియకుండానే జరిగిపోతాయి వసుదార తప్పవు అని రిషి చెప్తాడు. అర్థం చేసుకోండి సార్ ఎందుకంటే కొన్ని నిమిషాల్లో మాట్లాడలేను అని వసుదార చెప్తోంది.మీరు సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి సార్ నేను సంతోషించాలో బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు అని తనకుతాను మనసులొ మాట్లాడుకుంటూ ఉంటుంది వసుదార.
ఇంతలో రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.రిషి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత సాక్షి వచ్చే రిషి దగ్గరికి కంగ్రాట్స్ అని చెబుతుంది. పెళ్లి కుదిరింది కత చాలా పనులు ఉన్నాయి ఉంగరాల గురించే షాపింగ్ ఫ్రెండ్స్ ఇన్విటేషన్ ఏవేవో అన్నీ తనకు తానుగా మాట్లాడుతూనే ఉంటుంది సాక్షి.రిషి షాపింగ్ కి వెళ్దాం పద అని సాక్షి అంటే షాపింగ్ నాకు ఇష్టం ఉండదు అంతంతసేపు టైమ్ కేటాయించి సెలక్షన్ చేయడం నావల్ల కాదు అని రిషి చెప్తాడు. కొద్దిరోజుల క్రితం వసుదార కోసం షాపింగ్ చేసి డ్రగ్స్సు లు తెస్తాడు కదా అది గుర్తుతెచ్చుకుంటుంది సాక్షి. నువ్వే చూసుకో అని చెప్పి రిషి వెళ్లిపోతూ ఉండగా అక్కడికి జగతి వస్తుంది.ఏంటి అంటి ఆలోచిస్తున్నారు అని సాక్షి జగతి ని అంటోంది కొన్నికొన్ని జరగవు అనుకున్నట్లే అవి జరిగితే ఇలాగే ఉంటుంది అని జగతి అనగానే మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు ఆంటీ అని సాక్షి అంటోంది నీ మనసులో కూడా ఏం జరుగుతుందో నాకు తెలుసు అని జగతి అంటాది.ఇక తర్వాత రిషి దగ్గరికి మహీంద్రా వస్తాడు నీతో కొంచెం మాట్లాడనా రిషి అని అడుగుతాడు. ఒకప్పుడు మనం చాలా మంచి ఫ్రెండ్స్ లాగా వుండే వాళ్ళం అని మహేంద్ర అనగానే ఒకప్పుడు అని అంటారేంటి డాడీ ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా లేమా అని అంటాడు.

ఏమో తెలియదు ఒకప్పుడు ఉన్న ఫ్రెండ్ షిప్ ఎప్పుడు ఎక్కడకు ఎగిరిపోయింది అనిపిస్తోంది అని మహీంద్రా అంటాడు మీరేమైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పండి డాడీ అని రిషి అంటాడు. సాక్షిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి నాన్నా ఇదంతా ఏంటి ఒకప్పుడు సాక్షి పేరు వింటేనే నువు చాలా కోప్పడేవాడు చిరాకుపడేవాడివి అలాంటిది తనతో పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు అసలేం జరిగిందో కనీసం నాకైనా చెప్పాు అని మహేంద్ర అడుగుతాడు.నువ్వేంటో నిమనసెంటో నాకు తెలుసు నీ గుండె చప్పుడు నా చెవుల్లో మోగుతుందని నీకు తెలుసుగా నువు తప్పు నిర్ణయం తీసుకున్నావ్ అని మహీంద్రా అంటాడు. వసుధార గురించి ఆలోచించావా ఏమైనా పాపం తను పెళ్లిపీటలమీంచి వచ్చి చదువుకోసం చాలా కష్టపడుతుంది అలాంటి వసుదారని ఇలా ఒంటరిగా వదిలేస్తావా అని రిషి ని అడుగుతాడు మహేంద్ర.దాడిని అన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాను అని రిషి మహేంద్రతో అంటాడు నేను చాలా అడగాలని వచ్చాను కానీ నీ మాటలతో నెను అడగలేక వెళ్ళిపోతున్నాను ఇక నీ ఇష్టం అని చెప్పి మహీంద్రా వెళ్లిపోతాడు.ఇక ఆ తర్వాత వసుదార అమ్మవారు దగ్గరికి వెళ్లి కోపంగా బాధపడుతూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇది నేనేం అడిగాను నువు ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంది వసుధరా.
Guppedantha Manasu 9 August Today Episode 524 : రిషి సార్ తీసుకున్న నిర్ణయం మార్చకొడని తెలిసి, బాధని తట్టుకోలేక అమ్మవారి ముందు బాధను వ్యక్త పరిచిన వసుధార.
ఏంటి అమ్మా ఎలా చేశారు రిషి సార్ మనసులో ఏముంది అమ్మ రిషి సార్ మర్చిపోయాడా అసలేం జరుగుతుందో మనకే అర్ధం కావట్లేదు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటోంది వసుదార.అసలు రిషి సార్ జీవితాంతం సాక్షి తో ఎలా వుంటారమ్మా.రిషి సార్ నాకు పెట్టిన పరీక్ష లేక నువ్వు నాకు పెట్టి పరీక్ష అనే అమ్మవారిని అడుగుతుంది వసుధరా. ఎవ్వరు పరీక్ష పెట్టినా సరే నేను ఈ పరీక్షలో ఎదురు కొంటాను ఈ పరీక్షలో నేను గెలుస్తాను ఇది నా మనసుకి పరీక్ష లేదా నా ప్రేమకు పరీక్షనో తేల్చుకుంటాను అని అంటోంది వసుదార.రిషి సార్ నన్ను దూరం పెడుతున్నారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు పరిస్థితులే ఇలా జరిగేలాగా చేస్తున్నాయా నాకర్థం కావట్లేదు రిషి సార్ మనసుని ఎలా గెలుచుకోవాలొ నాకు తెలుసమ్మా నన్ను ఆశీర్వదించు అని అమ్మవారికి దండం పెట్టుకుంటుొది వదుదార.ఇక ఆ తర్వాత సాక్షి దేవయాని మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది ఇన్నాళ్లూ మనం ఎదురుచూస్తున్న కల సక్సెస్ అయింది కదా అని దేవయాని సాక్షితో అంటోంది.
ఏంటి అంటి నాకేం అర్ధం కావట్లేదు అసలు పెళ్లి జరుగుతుందో లేదోనని నాకు డౌట్ వస్తోంది రిషి పెళ్లికి ఒప్పుకున్నాడన్నమాట తప్ప నాతో షాపింగ్‌కి రాడు బయటికిరాడు ఐస్‌క్రీమ్ తినడానికి రాదు అసలు రిషి పెళ్ళి ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నాడు అని సాక్షి అంటోంది. ఇవన్నీ ఎందుకు సాక్షి ముందు రిషి మనసు ఎలా తెలుసుకోవాలో దాని గురించి ఆలోచించు ఇవన్నీ వదిలేసెయు అని చెప్తుంది సరే ఆంటీ అని సాక్షి వెళ్లిపోతుంది. తర్వాత రిషి వసుదార ఫోటో చూస్తూ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి సాక్షి వచ్చి రిషి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని ఏంటి రిషి నువు వసుని చుస్తున్నావు అని అడిగితే ఫోటో చూస్తున్నాను అని రిషి అంటాడు మనిద్దరికీ పెళ్లి జరగబోతుంది నువ్వేం చేస్తున్నావ్ అని సాక్షి కోపంగా అడుగుతోంది అసలు నువు నా రూమ్‌లోకి పర్మిషన్ అడక్కుండా ఎలా వస్తావు అని అడుగుతాడు రిషి.
ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి ఏం జరిగిందమ్మా అని సాక్షి ని అడిగితే వసుధార ఫోటో చూస్తూ మైమర్చిపోతున్నారు రిషి అనే సాక్షి అనగానే రిషికి చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ఏదో తెలిసిన అమ్మాయి కాబట్టి ఇంట్లోకి రానిచ్చాను ముందు నువు బయటికి వెళ్ళు అని రిషి అంటాడు. వెళ్లటమేంటి నీతో మాట్లాడటానికి వచ్చాను అని సాక్షి అంటోంది. మాట్లాడటమేంటి నీకసలు పద్ధతే లేదు ముందు నువ్వెళ్ళు అని అంటాడు రిషి. దేవయాని అంటితో చెపుతుంటే ముందు నువు బయటికి వెళ్లి తను చేసింది తప్పు అని రిషి అంటాడు .దేవయాని సాక్షిని తీసుకుని బయటికి వెళ్లగానే అక్కడ జగతీ, వసుధార ఇద్దరూ ఉంటారు సాక్షి వెంటనే నువ్విక్కడికెందుకొచ్చావు ఇదంతా నీ వలన జరుగుతుంది నా జీవితం మొత్తం నీ వల్లనే ఇలా తయారైంది అని సాక్షి కోపంగా వసుదార అంటుంటే సడన్‌గా రిషి డోర్ ఓపెన్ చేశాడు అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.