Janaki Kalaganaledu 9 August Today Episode 362 : జానకి కలగలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 9 మంగళవారం 362 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. జ్ఞానాంబ జానకిని పిలుస్తుంది. జానకి తో పాటు అందరూ అక్కడికి వస్తారు. ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ ఈ పుస్తకాలు నీవేనా అని జానకిని గట్టిగా అడుగుతుంది. అప్పుడు ఆ పుస్తకాలను జానకి తీసుకొని అవును అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ తోరాలను చూపిస్తూ ఇవి ఎంత విలువైన ఎప్పటినుంచి మన ఇంట్లో ఉంటున్నాయో నీకు తెలుసా.. మన కుటుంబం ఇంత సంతోషంగా ఉండడానికి ఇవే కారణం అంటూ పవిత్రమైన తోరాలని తీసి కింద పడేసి నువ్వు నీ పుస్తకాలను పెట్టుకుంటావా అని అంటుంది. అది కాదు అత్తయ్య గారు అసలు బుక్స్ మీ గదిలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు అని అంటుంది. నీకు తెలియకపోతే పుస్తకాలు అక్కడ ఎలా ఉంటాయి. నేను నీకు షరతులు పెట్టి 24 గంటలు అవ్వడం లేదు. అప్పుడే ఇలా చేస్తావా అని తిడుతుంది.
ఇంతలో మల్లికా కూడా జానకిని తిట్టడం మొదలు పెడుతుంది. తన నెత్తిమీదికి టోపీ వచ్చి టోపీ మీద కళ్ళు వచ్చాయి. అత్తయ్య గారు అని ఇక ఒక మీరు పెట్టిన ఐదు తప్పులలో ఒక తప్పు చేసింది జానకి. ఆ నెంబర్లలో ఒకటి కొట్టేయండి అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ ఏమీ మాట్లాడ పోయేసరికి నేనే కొట్టేస్తాను అత్తయ్య గారు అని మల్లికా అక్కడికి వెళ్లి కొట్టేయడానికి చూస్తుంది. అప్పుడు జానకి మల్లికను పిలిచి నువ్వు నా నెక్లెస్ కొట్టేసావు. నా నక్లెస్ నాకు ఇవ్వు అని అంటుంది. నీ నెక్లెస్ నేను కొట్టేయడమేంటి నాకు తెలియదు అని మల్లికా అంటుంది. నువ్వు నా నెక్లెస్ కొట్టేశావు అని గట్టిగా జానకి అంటుంది. నేను నీ నక్లెస్ కొట్టేసిన అని ఆధారాలు చూపిస్తావా అని అనగా.. నేను నా నెక్లెస్ ని పసుపు కుంకుమతో పూజ చేసి లోపల పెట్టాను నీ చేతులకి పసుపు అంటుకుంది కదా.. ఆ పసుపు కుంకుమ నీ చేతులకు ఎందుకు ఉన్నాయి అని అంటుంది జానకి. అప్పుడు మల్లికా ఎందుకంటే నేను తోరాలు తీసి కింద పడేసేటప్పుడు వాటికున్న పసుపు, కుంకుమ అంటిందని తను చేసిన తప్పుని తనే బయట పెట్టుకుంది.
Janaki Kalaganaledu 9 August Today Episode 362 : మల్లికను పగడ్బందీగా పట్టించిన జానకి… దాంతో భయపడిపోతున్న మల్లిక….

అప్పుడు జ్ఞానాంబ కాళ్ళపై పడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానంభ లేపి కొట్టబోతుంది. కానీ గోవిందరాజు ఆపుతాడు. కొట్టకముందే చచ్చేలా ఉంది ఆపేయ్ అని అంటాడు. జ్ఞానాంబ, జానకిని ఏమనుకోకు అమ్మ అవి అలా కింద ఉండటం చూసి నేను ఆవేశపడ్డాను అని అంటుంది. కట్ చేస్తే మల్లికా విష్ణు దగ్గరికి వచ్చి నాకు విడాకులు కావాలి అని అంటుంది. అప్పుడు నీకు పిచ్చా వెర్ర అని విష్ణు అంటాడు. అప్పుడు మల్లికా నువ్వు నాకు సపోర్టు ఉండడం లేదు. నాకు ఎలాంటి ఆపద వచ్చినా నా పక్కన నిలబడట్లేదు కాబట్టి. నేను నీతో కాపురం చేయలేను నాకు విడాకులు ఇచ్చేయండి అని అంటుంది. నువ్వు చేసే ప్రతి తప్పు కి సాక్ష్యంతో బయటపడుతున్నావ్ అప్పుడు నేను నీకు ఎలా సపోర్ట్ చేస్తాను అని అంటాడు. అప్పుడు మల్లికా నువ్వు నా మాట వింటావా లేదా విడాకులు ఇస్తావా అని గట్టిగా అంటుంది. అప్పుడు విష్ణు వింటానులే అని మాట ఇస్తాడు. అప్పుడు వెంటనే మల్లిక నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఒక చికెన్ బిర్యాని, ఒక చికెన్ పకోడీ ఇవి తీసుకొని రా అని అంటుంది.
అదేంటే ఇంట్లో వాళ్ళు ఎవరో నాన్ వెజ్ తినరు కదా నువ్వు ఎలా తింటావు అమ్మకు తెలిసిందంటే చంపేస్తది అని అంటాడు. అప్పుడు నా మాట వింటావా లేదా విడాకులు వెళ్దామా అని అనగానే సరేలే అని విష్ణు అంటాడు. కట్ చేస్తే రామ స్వీట్ షాప్ లో ఉండి ఆ షరతులు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి జానకి వస్తుంది. రామా గారు ఏమైందండీ పరధ్యానంగా ఉన్నారు అని అంటుంది. పరధ్యానం కాదండి అమ్మ పెట్టిన షరతులు కోసం నాకు చాలా భయమేస్తుంది. అని అంటాడు. అప్పుడు జానకి నేను అలాంటి వాటికి భయపడితే నేను ఐపీఎస్ ఎలా అవుతాను రేపు సమాజంలో ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కోవాలండి. ఈ చిన్న సమస్యలకి భయపడితే ఎలా అని అంటుంది. మీరు ఇలాంటివన్నీ ఇక ఆలోచించకండి. రండి… టిఫిన్ చేద్దాం రండి అని తనని తీసుకొని వెళ్లి ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంతోషంగా భోజనం చేస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే