Guppedantha Manasu 9 September 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 09-September-2022 ఎపిసోడ్ 551 ముందుగా మీ కోసం. నిన్నటి ఎపిసోడ్ లొ వసుధార, రిషిని, జగతి మహేంద్ర ల వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చెయ్యమని అడుగుతుంది. అప్పుడు రిషి ఏం మాట్లాడుతున్నావ్ వసుధార నేను చేయడం ఏంటి అని అనగానే, వసుధార మహేంద్ర సార్ అంటే మీకు ప్రాణం ఎంతో చేశారు. ఇది కూడా చేసి, మీ ప్రేమను నిరూపించుకోండి అని, ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రిషి అంటాడు డాడీ సంతోషం కోసమే, జగతి మేడమ్ ని ఇంటికి తీసుకొచ్చాను, ఇంకా నన్ను ఇంకొక మెట్టు దిగమని అంటున్నావా వసుధార అని అడుగుతాడు.తప్పేముంది సార్ మీ ప్రేమను నిరూపించుకోండి, ఇది వాళ్ళకి మీరిచ్చే బహుమతి అవుతుంది అని, ఇలా అడుగుతుా ఉంటుంది రిషిని.కానీ అందుకు రిషి ఒప్పుకోడు, తరువాత రిషి ఇంటికి వెళ్లాక,జగతి మహేంద్రతో మాట్లాడుతున్న మాటలను వింటాడు, మహేంద్ర మన వెడ్డింగ్ యానివర్సరీ గురించి కాదు ఇప్పుడు ఆలోచించాల్సింది అని, రిషి, వసుధారల బంధం గురించి ఆలోచించాలి.
Guppedantha Manasu 9 September 2022 Episode : రిషి దేవయానితో చెప్పిన మాటలు ఏంటి?
వాళ్ళ మధ్యలో మనం మాట్లాడలేము, అలా అని వాళ్ల గురించి ఆలోచించకుండా ఉండలేము అని, మనం చేసే పనివల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని, రిషి మనసు అద్దంలాంటిదీ మహేంద్ర, జాగ్రత్తగా చూసుకోవాలి, రిషికి ఇబ్బంది కలగకూడదు, మనం ఇలా సెలబ్రేషన్స్ అంటే రిషి బాధపడతాడు అని, రిషి గురించి మాట్లాడుతూ ఉంటుంది జగతి, ఈ మాటలన్నీ రిషి వింటాడు, ఈరోజు ఎపిసోడ్లో జగతి మాటలను విన్న రిషి ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో, నా గురించి ఇంతలా ఆలోచించే మీరు, ఆ రోజు నన్ను వదిలి ఎలా వెళ్లిపోయారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అనుకుంటాడు వీళ్లకి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చెయ్యాలి అని, వెంటనే దేవయాని దగ్గరికి వెళతాడు.పెద్దమ్మ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని, దేవయాని దగ్గిరికి వెళ్లగానే, దేవయాని వసుధార నేను చెప్పినట్టు అడిగినట్టుంది, అందుకే కోపంగా ఉన్నాడేమో రిషి అని సంతోషపడుతుంది మనసులో.

రిషి పెద్దమ్మ, డాడీ వాళ్ళ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చెయ్యాలి అని అనడంతో, దేవయాని షాక్ అవుతుంది. ఏంటి ఇలా అయింది అని అనుకుంటుంది మనసులో.ఇలా మాట్లాడుతూ ఉండగా, రిషి దేవయానికి మరొక ట్విస్ట్ ఇస్తాడు, పెద్దమ్మ నేను, వసుధార జీవితంలో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాము అని,వాళ్లు ప్రేమించుకుంటున్న విషయాన్ని చెబుతాడు దేవయానికి,డాడీ వాళ్ల వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అవ్వగానే, ఈ విషయాన్ని మీరే ఇంట్లో అందరికీ చెప్పాలి, తరువాత వసుధార అమ్మానాన్నల్ని పిలిపించి కూడా మాట్లాడాలి, ఇది మీరే చేయాలి పెద్దమ్మా అని అనడంతో, దేవయాని షాక్ అవుతుంది.ఇలా ఈరోజు దేవయానికి రిషి రెండు ట్విస్టులు ఇస్తాడు, ఒకటి జగతి మహేంద్రల వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తాను అని, ఇంకొకటి రిషి, వసుధార ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం గురించి,ఇలా రిషి మాటలకు షాకైన దేవయాని, సమాధానం ఏం చెబుతుంది రిషికి,దేవయాని మళ్లీ ఏదైనా కుట్ర పన్నబోతొoదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది.