Multani Mitti : ముల్తానీ మట్టి అంటే సహజంగా చాలామంది ప్యాక్ లాగా వేసుకుంటూనే ఉంటారు. ఈ ముల్తాన్ మట్టిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది చర్మం కాంతివంతంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అనేక చర్మ సంబంధిత ఇబ్బందుల నుండి రక్షించడానికి అద్భుతమైన మేలును అందిస్తుంది. అలాగే మొటిమలు, మచ్చలు చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి ఈ మట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మట్టి వలన కలిగే ఇతర లాభాలు ఏంటో చూద్దాం…
చర్మం మెరుపు కోసం: ముల్తానీ మట్టి నీ పాలతో కలిపి చర్మానికి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టడం వలన చర్మంపై ఉన్న టాన్ అంతా తొలగిపోతుంది. దీనిని ఈ విధంగా ఉపయోగించడం వలన పిగ్మెంటేషన్ ఇబ్బంది కూడా తగ్గిపోతుంది. అలాగే చర్మం మెరవడానికి చాలా బాగా సహాయపడుతుంది.
Multani Mitti : ముల్తానీ మట్టి మీ చర్మానికి వరం… ఎలాంటి లాభాలు ఉన్నాయి…

అదేవిధంగా మొహం పై మచ్చలు, మొటిమలు నివారించడానికి:
ఈ మట్టి పాలు కలిపి ముఖంపై అప్లై చేయడం వలన మచ్చలు మొటిమలు సమస్య తగ్గిపోతుంది. అలాగే ముఖంపై ఉన్న రంధ్రాలను లోతుగా క్లీన్ చేస్తుంది.
చికాకు ఎరుపును నివారించడానికి:
ఈ మట్టి వాడడం వలన చర్మాన్ని కూల్ చేస్తుంది. ఎండలో కందిన చర్మానికి ఈ మట్టి చాలా మేలుని కలిగిస్తుంది. దీనిలో ఉండే కూలింగ్ గుణాలు చర్మానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
ముఖాన్ని ఎక్స్పోలియట్ చేయడానికి:
ఈ మట్టి ముఖంపై ఎక్స్పోలియోట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది సాధారణమైన కేన్సర్ గా ఉపయోగపడుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని కూడా నివారిస్తుంది. అలాగే చర్మాన్ని లోతుగా వెళ్లి శుభ్రపరుస్తుంది.