Health benefits : కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె అన్ని మన శరీరానికి మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లాంటి విలువైన పోషకాలు ఉంటాయి. అలాగే కొబ్బరి నీళ్లల్లో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు కొబ్బరి నీళ్లను త్రాగడం వలన శరీర డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అలాగే చర్మం కూడా మంచి నిగారింపు వస్తుంది.
కొబ్బరి నీళ్ళు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే అలసటగా ఉన్నవారు కొబ్బరి నీళ్లను త్రాగడం వలన కొంత ఎనర్జీని పొందగలరు. అలాగే కొబ్బరి నూనెతో మన జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. అయితే పరిగడుపున కొబ్బరి తీసుకోవడం వలన మనకు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పరిగడుపున కొబ్బరి తినడం వలన త్వరగా ఆకలి అనిపించదు. ఇది కాకుండా కొబ్బరిలో ట్రై గ్లిజరైడ్స్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే బరువు తగ్గాలనుకున్నవారు ప్రతిరోజు ఖాళీ కడుపుతో కొబ్బరిని తింటే మంచి ఫలితం దక్కుతుంది.
Health benefits : పరిగడుపున కొబ్బరి తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా

కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వలన శరీరంలో అనవసరపు కొవ్వును తగ్గించి, సులువుగా బరువు తగ్గేలా చేస్తుంది. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గటానికి వివిధ రకాల మెడిసిన్స్ ను వాడే బదులు, ప్రతిరోజు పరిగడుపున కొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే కొబ్బరిలో బాదం, వాల్ నట్స్, చక్కెర లేదా బెల్లం లాంటివి కలిపి ప్రతి రోజు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు రావు. కొబ్బరిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.అలాగే తరచుగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఖాళీ కడుపుతో కొబ్బరిని తినాలి.
కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే అజీర్ణం, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతిరోజు పరిగడుపున కొబ్బరిని తినాలి. ఇలా చేయడం వలన మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు త్రాగడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నీళ్లల్లో ఉండే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును బాగా అదుపులో ఉంచుతాయి. కొబ్బరినీళ్లు త్రాగాక కొబ్బరిని తినడం చాలా మంచిది. ఇది తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది.