Raana : దగ్గుబాటి వారసుడు హీరో రానా తెలుగు పరిశ్రమలోకి ‘ లీడర్ ‘ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. తర్వాత వరుస సినిమాలు చేస్తూ పాపులారిటీని దక్కించుకున్నాడు. రానా హీరోగా కంటే విలన్ గా ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించారు. ‘ బాహుబలి ‘ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రానా హీరోగా కంటే విలన్ గానే సెట్ అయ్యాడు అంటూ సినీ ప్రముఖులు మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ భీంలా నాయక్ సినిమాలో కూడా రానా తన యాక్టింగ్ తో చించేసాడు.
Raana : భార్య కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రానా…
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన కన్నా రానా యాక్టింగ్ బాగుంది అంటూ అతడిపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా హిట్ లో సగభాగం రానా కే అంటూ డైరెక్టర్ అఫీషియల్ గా కూడా ప్రకటించారు. అంత బాగా మెప్పించారు రానా. కాగా రానా లాస్ట్ నటించిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమా లో రానా నటన బాగున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రానా అని శభాష్ అంటూ మెచ్చుకున్నారు. సినిమా తర్వాత రానా కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

దానికి కారణం ఆమె భార్య మిహిక. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రానా ఆమెకు కొంచెం కూడా టైం కేటాయించలేకపోతున్నాడట. అందుకే కొంతకాలం గ్యాప్ తీసుకొని పూర్తిగా తన భార్యకే టైం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే రానా ఓ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాని కోసం ఏకంగా 20 కోట్లు వదులుకున్నట్లు మరో వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అయినా భార్యతో సమయం గడపడం ముఖ్యమే కానీ రాని ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం ఏంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.