Health Tips : పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ జలుబు ,దగ్గు సమస్యలను ఎదుర్కొనేవారు పసుపు పాలు తాగడం తాగడం వల్ల ఈ సమస్యలు వెంటనే తగ్గుముఖం పడతాయి. దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. పసుపు పాలు రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల జలుబు, దగ్గు సమస్యలతో పాటు ఇంకా ఇతరత వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే అదే సమయంలో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పసుపు పాలకు దూరంగా ఉండడం మంచిది. పసుపుని ఆయుర్వేదంలో ప్రయోజకరమైన ఔషధంగా పరిగణిస్తారు. పసుపులో ఔషధ గుణాల అధికంగా ఉండడం వల్ల అనేక చికిత్సలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
Health Tips : పసుపు పాలు తాగే వారు తస్మాన్ జాగ్రత్త….
అందుకే చాలామంది పాలల్లో పసుపు వేసుకొని తాగడం అలవాటుగా చేసుకుంటున్నారు. పసుపు కలిపిన పాలల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, క్యాల్షియం వంటి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. పసుపు పాలల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పసుపు పాలను ఎటువంటి సందర్భంలో తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్న వ్యక్తులు డాక్టర్ సలహా మేరకు పసుపు పాలు తీసుకోవాలి. హైపోగ్లైసిమియా ఉన్న రోగులు పసుపు పాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత తగ్గవచ్చు.

గ్యాస్ ,మలబద్ధకం అజీర్తి ,కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడేవారు పసుపు పాలను తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే పసుపు పాలను తీసుకోకపోవడం ఉత్తమం పసుపులో ఆక్సిలేటెడ్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్ సమస్యలను పూర్తిగా నివారిస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పసుపు పాలులు దూరంగా ఉండాలి. కానీ పసుపు కు వేడి కలిగించే గుణం ఉంటుంది. పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే చాలా మంచిది.