Viral Video : ఇది సోషల్ మీడియా యుగం. ఏం చేయాలన్నా సోషల్ మీడియాలోనే. ముఖ్యంగా నేటి యూత్ అయితే సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా ప్రపంచంలోనే బతుకుతున్నారు. తమ టాలెంట్ ను అక్కడే చూపిస్తున్నారు. లైక్స్, కామెంట్ల కోసం ఎంతో తాపత్రయపడుతున్నారు. మనది కాని.. వర్చువల్ ప్రపంచంలో జీవిస్తున్నారు. డ్యాన్సులు గట్రా చేస్తూ తామేంటో సోషల్ మీడియాలో నిరూపించుకోవడం కోసం నేటి యువత ఎంతో ట్రై చేస్తోంది.
ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం, యూట్యూబ్ లో షార్ట్స్, ఫేస్ బుక్ లో రీల్స్.. ఇలా పలు సోషల్ మీడియా నెట్ వర్క్స్ లో రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది నేటి యూత్. సాధారణంగా వీడియోలు చేస్తే అందులో కిక్కేముంటుంది. అందుకే కొందరు అయితే సాహసాలు చేస్తున్నారు. రిస్క్ చేస్తూ వీడియోలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆ రిస్క్ వల్ల ఒక్కోసారి సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తోంది.
Viral Video : భయపడుతూనే ఆవు దగ్గర రీల్స్ చేసిన యువతి
తాజాగా ఓ యువతి వెరైటీగా రీల్స్ చేయాలని అనుకుంది. దాని కోసం ఏకంగా ఓ ఆవు దగ్గరికి వెళ్లింది. ఆవు దగ్గర రీల్స్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని అనుకుందో ఏమో కానీ.. భయపడుతూనే ఆవు దగ్గరికి వెళ్లింది. ఆవు ఏమైనా అంటుందేమో అని దానికి కాస్త దూరంగా నిలబడి రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంతలో ఆ ఆవుకు కోపం వచ్చిందో ఏమో కానీ.. ఆవు వెనక్కి తిరిగి ఆ యువతిని బెదిరించింది. అంతే కాదు.. కొమ్ములతో ఢీకొట్టేందుకు ఆవు.. ఆ యువతి వైపు పరిగెత్తగా.. వెంటనే ఆ యువతి అక్కడి నుంచి పరుగు లంఖించుకుంది. ఈ ఘటన వీడియోలో రికార్డు కావడంతో ఆ వీడియోను అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి లైక్స్, కామెంట్స్ కోసం మరీ ఇంతలా రిస్క్ చేయాలా? ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.