Raashi : రాశి ఎమోషనల్ లవ్ స్టోరీ… అందుకే వందల కోట్ల ఆస్తి వదులుకుందంట…

Raashi : హీరోయిన్ రాశి అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం. అప్పట్లో స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె కెరీర్లో శ్రీకాంత్ హీరోగా నటించిన ‘ ప్రేయసి రావే ‘ సినిమా మంచి సక్సెస్ ను అందించింది. ఈ సినిమాలో తన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క మహేష్ బాబు ‘ నిజం ‘ సినిమాలో విలన్ పాత్రలో నటించింది. ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తన సినీ కెరీర్ ను భర్త కోసం వదిలేసిన రాశి చాలా కాలం తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. రాశి సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో చాలా డబ్బులు సంపాదించింది.

Advertisement

ఆ సమయంలోనే తనకు కోటీశ్వరుల సంబంధాలు వచ్చాయట. కానీ రాశి మాత్రం ప్రేమించిన వ్యక్తిని చేసుకుంటానని ఇంట్లో వారికి చెప్పడంతో చివరికి పెద్దవాళ్లు అంగీకారంతో అతడినే పెళ్లి చేసుకుంది అందాలరాశి. ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది. అయితే రాశి భర్త ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అప్పట్లో చాలా మంది హీరోలు రాశి డేట్ ల కోసం వేచి చూశారట. ఇండస్ట్రీలో చాలా విజయాలు సాధించి బాగా డబ్బులు సంపాదించుకుంది రాశి. కొంతకాలానికి సినిమా నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టింది. కాని కథల ఎంపిక విషయంలో తడబాటు వలన నిర్మాతగా నష్టపోయింది.

Advertisement

Raashi : రాశి ఎమోషనల్ లవ్ స్టోరీ…

Heroin Raashi heart touching love story
Heroin Raashi heart touching love story

కొంతకాలానికి రాశి తండ్రి మరణించాడు. దాంతో ఆమె చాలా కృంగిపోయిందట. అదే సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ముని ఆమెకు ధైర్యం చెప్పి దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకున్నాడట. దీంతో శ్రీ ముని లోని కేరింగ్ నచ్చి అతనితో ప్రేమలో పడిందని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. అప్పటికే రాశిని పెళ్లి చేసుకోవడానికి పెద్ద వ్యాపారవేత్తలు ఎన్నారైలు ఆసక్తి చూపించారు. కానీ రాశి మాత్రం తనకు తోడుగా నిలిచిన శ్రీముని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటూ గృహిణిగా మారిపోయింది. ప్రస్తుతం బుల్లితెరలో ‘ జానకి కలగనలేదు ‘ సీరియల్ లో నటిస్తుంది.

Advertisement