Sumanth : కీర్తి రెడ్డితో విడిపోయాక సుమంత్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు… దానికి కారణం ఇదా…!

Sumanth : సినీ పరిశ్రమలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ లో సమంత, నాగచైతన్యల జంట కూడా విడాకులు తీసుకున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీలో మరో హీరో కూడా హీరోయిన్ ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగార్జున మేనల్లుడు హీరో సుమంత్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగలేకపోయినా కొన్ని మంచి సినిమాలను చేశారు. ఏఎన్ఆర్ కు అత్యంత ఇష్టమైన మనవడు యార్లగడ్డ సుమంత్. సుమంత్ గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోవడంతో సినిమాల్లో ముఖ్యమైన పాత్రలో నటిస్తూ వస్తున్నారు.

Advertisement

ఇటీవల విడుదలైన సీతారామం సినిమాలో సుమంత్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే సుమంత్ హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కీర్తి రెడ్డి మహేష్ బాబు ‘ అర్జున్ ‘ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక సుమంత్ సోదరి ద్వారా అతడికి కీర్తి రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో సుమంత్ కీర్తి రెడ్డి 2004లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుంది. కీర్తి రెడ్డి సుమంత్ ను సినిమాలు వదిలేసి అమెరికా వచ్చేసి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకోవచ్చని కోరగా సుమంత్ దానికి నిరాకరించాడు.

Advertisement

Sumanth : కీర్తి రెడ్డితో విడిపోయాక సుమంత్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు…

Hero sumanth not getting married after his divorce
Hero sumanth not getting married after his divorce

చివరికి ఆ గ్యాప్ పెద్ద కావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తర్వాత కీర్తి రెడ్డి రెండో పెళ్లి కూడా చేసుకుంది. ఇక సుమంత్ విడాకులు తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో సుమంత్ ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదు అని చాలామంది అనుకుంటున్నారు. తన రెండో పెళ్లి విషయమై సుమంత్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. కీర్తి రెడ్డితో విడాకుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు చేసుకుంటా అని కామెంట్ చేశాడు.

Advertisement