Rejina : హీరోయిన్ రెజీనా కసాండ్రా తెలుగులో సుధీర్ బాబు నటించిన ఎస్ఎంఎస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ తర్వాత తనకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమా అంతగా హిట్ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. అప్పుడప్పుడు ఏదో ఒక అవకాశం అందిపుచ్చుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. దర్శకుడు రమేష్ వర్మ, రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ శాకిని డాకిని ‘ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని సురేష్ బాబు డి, సునీత తాటి, తామస్ కిన్ నిర్మించారు. డీజే మై సంగీతం అందించారు.
Rejina : అబ్బాయిల కెపాసిటీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రెజీనా…
అయితే కొద్ది రోజులుగా రెజీనా సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది. తాజాగా ఆమె అబ్బాయికి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అబ్బాయిలు మ్యాగీ నూడిల్స్ రెండు ఒకటే. రెండు నిమిషాల్లో అయిపోతారు అని అన్నారు. ఆ జోక్ విన్న మేల్ యాంకర్ కి కాసేపటి వరకు అర్థం కాలేదు. దాంతో రెజీనా నా జోక్ నీకు అర్థం కాలేదా అని యాంకర్ ని అడుగుతుంది. దానికి మేల్ యాంకర్ లేదు నాకు అర్థమైంది కానీ దాన్ని డిస్టర్బ్ చేయవద్దు అంటూ తల పట్టుకున్నాడు. దీంతో రెజీనా పరోక్షంగా అబ్బాయిల శృంగార సామర్థ్యంపై సెటైర్ వేసిందని నెటిజన్స్ అనుకుంటున్నారు.

రెజీనా వేసిన జోక్ కి నివేద తల పట్టుకుంది. ఈ భామ ఎందుకు ఇలా అయింది అంటూ కొందరు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా రెజీనా ఒక్క జోక్ తో తన లేటెస్ట్ సినిమా కి ప్రచారం కల్పించింది. ఇప్పుడు జనాలు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మడు ఇటీవల’ ఆచార్య ‘ సినిమాతో పలకరించింది. ఆచార్య సినిమాలో ఐటమ్ సాంగ్ లో చిరుతో స్టెప్ వేసి ఆకట్టుకుంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో రెజీనా గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.