Flipkart Big Billion Days : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో ప్రతి సంవత్సరం ముఖ్యమైన పండుగల సమయంలో సేల్ ను నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి బిగ్ బిలియన్ డేస్ పేరుతో మరో సేల్ కు తెరలేపింది ఫ్లిప్ కార్ట్. బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఎక్కువగా గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్ లో టాప్ బ్రాండ్స్ మీద భారీ డిస్కౌంట్లను అందించనున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ.. లాప్ టాప్స్, స్మార్ట్ వాచెస్, మొబైల్స్ ఇలా అన్ని రకాల గాడ్జెట్స్ మీద డిస్కౌంట్ లభించనుంది.

గాడ్జెట్స్ తో పాటు క్లాతింగ్, ఫుట్ వేర్, ఫర్నీచర్, బ్యూటీ, టాయిస్, ఇతర ప్రాడక్ట్స్ మీద కూడా పలు ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ తీసుకొస్తోంది. సేల్ ప్రారంభం అయ్యాక గ్రాసరీల మీద కూడా పలు ఆఫర్లను పొందొచ్చు. భారీ డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్, ఇన్ స్టంట్ డిస్కౌంట్స్ లాంటి ఎక్స్ ట్రా డిస్కౌంట్లను కూడా ఈ సేల్ లో పొందొచ్చు.
Flipkart Big Billion Days : ఈ కార్డ్స్ ఉంటే అదనపు డిస్కౌంట్ పొందండిలా
ఒకవేళ మీ వద్ద ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ కానీ.. యాక్సెస్ బ్యాంక్ కార్డ్స్ కానీ ఉంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఫ్లిప్ కార్ట్ పే లేటర్ ద్వారా కొనుగోలు చేస్తే ఇన్ స్టంట్ క్రెడిట్, ఈజీ ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. దసరా, దీపావళి సందర్భంగా అతి త్వరలోనే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ యాప్ లో బిగ్ బిలియన్ డేస్ లో సేల్ లో ఉండే ప్రాడక్ట్స్ ను లిస్ట్ చేశారు. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ అయితే 24 గంటల ముందే ఈ సేల్ ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఐఫోన్ పై కూడా భారీ డిస్కౌంట్లు పొందొచ్చు. ఐఫోన్ 11 సిరీస్ నుంచి ఐఫోన్ 13 మోడల్స్ వరకు భారీ డిస్కౌంట్లను పొందొచ్చు. అలాగే.. ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ ద్వారా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను దక్కించుకోవచ్చు.