Zodiac Signs : ఆగస్టు నెల 2022లో మేష రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం.. మేషరాశిలో కుజుడు, రాహు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి, 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలో ఉన్నటువంటి శుక్రుడు ఏడో తేదీ వరకు ఉండి కర్కాటంలోకి వస్తాడు. అదేవిధంగా కర్కాటకంలోకి ఉన్నటువంటి రవి 16వ తేదీ నుంచి సింహంలోకి వెళ్తాడు. సింహంలో ఉన్న బుధుడు, చంద్రులు కలిసి ఉన్నారు. ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహం రాశిలో ఉండి తరువాత కన్యారాశి లోకి వెళ్తాడు. అలాగే వృశ్చికంలో కేతువు మకరంలో వరించినటువంటి శని మీనరాశిలో వక్రరించినటువంటి గురువు ఉన్నాడు.
ఈ మేష రాశి వారికి: రాశిలో కుజుడు ఉన్నాడు ఆ కుజుడు 11వ తేదీ నుండి ద్వితీయ భాగంలోకి వెళ్తాడు.
ఈ రాశి వారికి: పనుల వల్ల ఒత్తిడిలు కలుగుతాయి. అలాగే ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని కష్టమైన విషయాలను హ్యాండిల్ చేయవలసి వస్తుంది. కొంత పవర్,ఎనర్జిటిక్ కూడా ఉంటారు. 11వ తేదీ వరకు, 11వ తేదీ తర్వాత సంతానం విషయంలో ప్రయత్నించే వారికి కొత్త పనులు చేయాలి. అనుకునే వారికి మంచి ఫలితాలు అందుతాయి.
Zodiac Signs : మేష రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు
అలాగే భూముల ద్వారా ధనం సంపాదించాలి అనుకునేవారు కావచ్చు, కుటుంబ సభ్యుల సహాయంతో వాహన వ్యాపారాలలో, అలాగే రైతులకు ధనం కోసం చేసే ప్రయత్నాలు అన్ని కూడా మంచి ఫలితాలను అందుకుంటారు.అలాగే 11వ తేదీ నుండి రాజకీయ సంబంధించిన విషయంలో కానీ సంతాన సంబంధించిన విషయంలో కానీ అలాగే ప్రేమ వ్యవహారాలకు, సంబంధించిన విషయాలలో కానీ కొంతవరకు గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే నిత్యము గణపతి దగ్గర దీపారాధన చేయాలి. ఉలవలు దానం చేయాలి.
కేతువు దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేయడం వలన ఘర్షణలు తగ్గి, అలాగే కొన్ని ఒత్తుడులు కూడా తగ్గుతాయి. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి బిజినెస్ సంబంధించిన విషయాలలో అలాగే పార్టనర్ విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి.అన్ని విషయాలలో మంచి అనుకూలత ఉండాలి అంటే, ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన: సూర్య భగవానుని ఆరాధన చేయాలి, కుమారస్వామి యొక్క అష్టోత్రం చదవాలి. ఇలా చేయడం వలన అన్ని విధాలుగా మంచి ఫలితాలను అందుకుంటారు.