Health Benefits : నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరూ తరచుగా తీసుకుంటారు. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలామంది ఆహారంలో నిమ్మరసాన్ని యాడ్ చేసి తీసుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది నిమ్మరసంని ఉపయోగించి అద్భుతమైన వంటలు తయారు చేస్తున్నారు. అయితే నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు గురి అవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిమ్మ రసాన్ని ఆహార పదార్థాల లో ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. చాలామంది బరువు తగ్గడానికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ ,తేనేను కలిపి తీసుకుంటారు. ఇలా తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు అధికమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు తెలియజేశారు. అయితే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజువారీగా నిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల శరీరం డిహై డ్రేషన్ గురి అవుతుంది. ఈ రసాన్ని అధికంగా తాగడం వల్ల శరీరంలో నీటి కొరత ఉంటుంది.
Health Benefits : శరీరంలో నిమ్మరసం అధికమైతే…. ఎటువంటి సమస్యలకు గురి అవుతామో తెలుసుకుందా.

నిమ్మరసం అధిక పరిమాణంలో ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి దంత సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చర్మం పొడిబారే వారు నిమ్మరసానికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ రసాన్ని జుట్టుకి అధికంగా అప్లై చేస్తే జుట్టు చిగుర్లు పొడిబారే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేశారు. కాబట్టి ఈ రసాన్ని రోజూ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఈ రసం మన శరీరంలో అధికమైతే అనేక సమస్యలకు గురి అవుతాము.