Zodiac Signs : ధనస్సు రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఈ విధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : ఆగస్టు నెలలో 2022 ధనస్సు రాశివారు గ్రహస్థితి ఏవిధంగా ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం… మేషరాశిలో కుజుడు, రాహువు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలోనే ఉన్నటువంటి శుక్రుడు ఏడవ తేదీ నుండి కర్కాటకం లోకి వస్తాడు. అదేవిధంగా కర్కాటకంలోని ఉన్నటువంటి రవి, 16వ తేదీ నుంచి సింహంలోకి వెళ్తాడు. సింహంలో ఉన్న బుధుడు, చంద్రులు కలిసి ఉంటారు.

ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహరాశిలో ఉండి, తర్వాత కన్య రాశిలోకి వెళ్తాడు. అలాగే వృశ్చికంలోని కేతువు మకరంలోని ఒకరించినటువంటి శని మీన రాశి లోని వక్కిరించినటువంటి గురువు ఉన్నారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ రాశి యొక్క నాధుడు బుధుడు స్వక్ష స్థలంలో ఒకరించి ఉన్నాడు. అయితే ఈ రాశి వారు కొన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు రావాల్సినటువంటి ధనం తొందరపడి తీసుకోకపోతే మళ్లీ అది పెండింగ్ లో పడుతుంది.

Zodiac Signs : ధనస్సు రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా గ్రహస్థితి ఈ విధంగా ఉన్నాయంటే…

horoscope August 2022 Zodiac Signs for Sagittarius
horoscope August 2022 Zodiac Signs for Sagittarius

అలాగే భూమి కానీ, గృహము కానీ, పంట పొలాలు కానీ, రియల్ ఎస్టేట్లో ప్లేసులు కానీ అమ్మకానికి పెట్టి ఉంటే వీటికి మంచి ధర వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా రాజకీయ నాయకులు అయితే కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నించేవారు, 11వ తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఘర్షణ వాతావరణం కనబడుతుంది. ఈ రాశి వారి సంతానం ఎవరైతే ఉంటారో, వాళ్లు 11వ తేదీ తర్వాత విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వివాహనికి సంబంధించిన ప్రయత్నాలు, ఏడవ తేదీ వరకు బంధు వర్గంలో సంబంధాలు కుదిరేటి అవకాశం కనిపిస్తుంది.

అలాగే 21వ తేదీ తర్వాత వ్యాపారం మొదలు పెట్టడానికి, విదేశాలకి వెళ్లడానికి, మీ యొక్క భాగస్వామి చేత బిజినెస్ పెట్టించడానికి ఈ యొక్క గ్రహ స్థితి తోడ్పడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి అన్ని విధాలుగా మంచి జరగాలి అంటే..ఈ ధనస్సు రాశి వారు చేయవలసిన దేవతరాదన: కూజుడు, రాహువుల దగ్గర దీపారాధన చేయండి. గోవులకు బెల్లం ఉండలు పెట్టండి అలాగే క్యారెట్లు తినిపించండి. అదేవిధంగా నరసింహ స్వామి, లేదా కుమారస్వామి లేదా, దుర్గామాత ఆరాధన చేయండి. అన్ని విషయాలలో అద్భుతాలు జరుగుతాయి.