Mangala Gowri Vratham : హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు శ్రావణమాసం అంతా తలస్థానం ఆచరించి, పసుపు కుంకుమలను ధరించి లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. అలాగే తెలుగు వారి సంప్రదాయం ప్రకారం మహిళలు శ్రావణమాసంలో ఈ మంగళ గౌరీ వ్రతం తమ పసుపు ,కుంకుమలు పదిలంగా ఉండాలని చేసుకుంటారు.
శ్రావణమాసంలో ప్రతి మంగళవారం కొత్త వస్త్రాలను ధరించి, ఉపవాసం ఉంటూ… పండ్లు ,పూలు ,పసుపు,కుంకుమలతో ఈ అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తారు. ఈ మాసంలో మంగళ గౌరీ వ్రత విధానం, దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రావణమాసంలోనే ప్రతి మంగళవారం పెళ్లయిన మహిళలు తమ భర్తలు దీర్ఘాయువుతో ఉండాలని మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి వరుడు కోసం మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు.
Mangala Gowri Vratham : మంగళ గౌరీ వ్రత విశిష్టత ఏంటి?
శ్రావణమాసం ఈ సంవత్సరం 29 జులై 22న మొదలయ్యింది. ఇది ఆగస్టు 27 వరకు కొనసాగుతుంది. శ్రావణ మాసంలో మొత్తం నాలుగు మంగళవారాళ్లు ఈ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.మంగళ గౌరీ పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. శ్రావణ మంగళవారం రోజున మహిళలు ఉదయాన్నే లేచి తలంటి కొత్త బట్టలు ధరించి పసుపు, కుంకుమ లు ఆచరించి ఈ వ్రతాన్ని మొదలుపెడతారు. ఈ వ్రతంలో కొబ్బరికాయ కి ఎరుపు రంగు జాకెట్ ముక్కను చుట్టి రాగి చెంబుపై పెట్టాలి.
అమ్మవారికి పసుపు, కుంకుమలు, పూలు,పెట్టి పూజ ప్రారంభించండి. పూజ ముగిసిన తర్వాత మంగళ గౌరీ వ్రతం కథను చదవండి. ఆ తరువాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి హారతిని ఇచ్చి పూజని ముగించండి. ఈ గౌరీ వ్రతాన్ని చేసిన రోజు ఉప్పు లేకుండా భోజనం చేయాలి కేవలం ఒక పూట మాత్రమే ఆహారాన్ని తీసుకొని ఆ తరువాత పాలు పండ్లు తింటూ ఉండాలి. ఇలా శ్రావణ మంగళవారం రోజున గౌరీవ్రతాన్ని చేసుకోవడం వల్ల తమ పసుపు ,కుంకుమలు పదిలంగా ఉండి, ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయని వాస్తు నిపుణులు తెలియజేశారు