Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఈమె సినిమాలకి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ ఇటీవల రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రేమలత లవణం అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రేణు దేశాయ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మీడియాతో ముచ్చటించిన రేణు దేశాయ్ సినిమాతో పాటు పలు ఆసక్తికర విషయాలను కూడా తెలియజేశారు.
ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ హీరో అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు . కానీ అఖిరాకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని హీరో అవడం జరగదని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం అఖీరానందన్ అమెరికాలోని ఒక ఫిలిమ్ స్కూల్లో మ్యూజిక్ మరియు కొన్ని ఇతర కోర్సులు నేర్చుకుంటున్నారు. తాజాగా రేణు దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ… అఖిరా నందన్ హీరో అస్సలు అవ్వడు అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదని మరోసారి చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో తల్లిగా మీ కొడుకుని మీరు ఎలా చూడాలనుకుంటున్నారని యాంకర్ అడుగగా…అఖిరా ఒక పెద్ద స్టేడియంలో కొన్ని వందల ప్రేక్షకుల ముందు పియానో వాయిస్తూ ఉంటే చూడాలని ఉంది అని చెప్పుకొచ్చింది.
నాటి గా ఏ తల్లి అయిన తన కొడుకుని స్క్రీన్ పై చూడాలని అనుకుంటుంది కానీ అదేవిధంగా తన కొడుకుకు ఏది అవ్వాలని ఉందో అది నిర్వర్తించడం కూడా తల్లి బాధ్యత. అఖిరా ఇంకేదైనా అవుతానని చెప్పిన ఓకే చెబుతానని రేణు దేశాయ్ తెలిపింది. ఇక ఆఖీరా పియానో చాలా బాగా వాయిస్తాడని మనందరికీి తెలిసిందే.గతంలో కూడా చాలాసార్లు పియానో వాయిస్తున్న వీడియోలను రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాక అఖిరా నందన్ ఓ షార్ట్ ఫిలిం కి సంగీత దర్శకత్వం కూడా వహించాడు. ఈ నేపథ్యంలో అఖీరానందన్ భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని అందరూ భావిస్తున్నారు. మరి అఖిరా నందన్ భవిష్యత్తులో ఏమవుతాడోవేచి చూడాలి.