Mahalaya Amavasya : ఈ సంవత్సరంలో అక్టోబర్ 14న మహాలయ అమావాస్య తో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. అందుకే అమావాస్యనాడు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయమని పండితులు చెబుతున్నారు. ఈ పరిహారం చేయకపోతే గ్రహణం తర్వాత వచ్చేటువంటి కొన్ని చెడు ప్రభావాలు కొడుకులు ఉన్నటువంటి కుటుంబాల మీద పడొచ్చు అని అంటున్నారు. ఈ పరిహారం చేసుకుంటే అన్ని రకాలుగా అనుకూలమైన కాలం ఉంటుంది. ప్రయత్నించే ప్రయత్నాలు సానుకూల ఫలితాలు అందిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులు తొలగి జీవితంలో సరికొత్త ఉత్సాహం అనేది వస్తుంది అని జ్యోతిష్యం చెబుతుంది.
ఈ అమావాస్య రోజు పితృదేవతల రుణం తీర్చుకోవడానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మహాభారతంలో కూడా ఈ అమావాస్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుసుకొని చేయవలసిన పూజా విధానాలు పాటిస్తే తప్పకుండా జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోయి పితృ దోషాలు తొలగిపోయి విజయాలు వరిస్తాయి. ఈ మహాలయ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఉదయాన్నే నిద్ర లేచి సూర్య నమస్కారం చేసుకొని ఈరోజు ఉపవాస దీక్షను చేయబోతున్నాను, నా కుటుంబానికి నాకు రాబోయే కష్టాలను నుంచి ఉపశమనం కలిగించమని సూర్య భగవానుడిని వేడుకోవాలి.
పూజ చేసేటప్పుడు సూర్యాష్టకం చదవాలి. తల్లి , కొడుకు వేరు వేరు చోట్ల కనుక ఉంటే ఇక్కడ తల్లి సూర్యాష్టకం చదువుతుంటే అదే సమయంలో కొడుకు కూడా అక్కడ సూర్యాష్టకం చదువుకునేలాగా ముందుగానే అన్ని సిద్ధం చేసుకోవాలి. చదువుకునేటప్పుడు కచ్చితంగా పసుపు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు ఉపయోగించాలి. ఈ అక్షింతలని పూజ అయిపోయిన తర్వాత ఎరుపు రంగు వస్త్రంలో కట్టి డబ్బును ఎక్కడైతే దాచిపెడతారో అక్కడ ఈ వస్త్రాన్ని మళ్లీ అమావాస్య వచ్చేవరకు ఉంచాలి. ఆ రోజంతా ఉపవాసం చేయాలి. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఎవరైతే ఈ పరిహారాన్ని పాటిస్తారో ఆర్థిక కష్టాల నుంచి బయటపడడమే కాకుండా అన్ని రకాలుగా అనుకూలమైన కాలం ఉంటుంది అని పండితులు తెలియజేస్తున్నారు.