Ram Pothineni : విరాట్ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా….రామ్ పోతినేని…

Ram Pothineni  : టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇద్దరికీ కాస్త దగ్గర పోలికలు ఉంటాయి. వీరిద్దరి హైట్ మరియు ఫేస్ కట్ దాదాపు ఒకేలా అనిపిస్తుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ టైంలో రామ్ లుక్స్ చూసి చాలామంది విరాట్ కోహ్లీ అని బ్రహ్మ పడ్డారు. దీంతో అప్పట్లో రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోలకు విరాట్ కోహ్లీ డూప్లా ఉన్నావ్ అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే తాజాగా హీరో రామ్ ఈ విషయంపై స్పందించారు. ఇటీవల రామ్ పోతినేని నటించిన స్కంద సినిమా సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది.

Advertisement

if-i-get-a-chance-to-act-in-virats-biopic-i-will-definitely-do-it-ram-pothineni

Advertisement

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో రామ్ ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ సంకేత్ మాత్రే కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేస్తూ సంకేత్…మీరు విరాట్ కోహ్లీలా ఉంటారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు….ఒకవేళ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే చేస్తారా అని ప్రశ్నించాడు.దానికి రామ్ స్పందిస్తూ…విరాట్ ల ఉంటానని చాలామంది అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ టైంలో లుక్స్ డిసైడ్ చేశాక కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఇంకా అప్పటినుండి మా ఇద్దరి మధ్య కంపారిజన్ మరింత ఎక్కువైంది.

if-i-get-a-chance-to-act-in-virats-biopic-i-will-definitely-do-it-ram-pothineni

ఇండియన్ స్టార్ క్రికెటర్ నన్ను పోల్చుతున్నారు చాలా హ్యాపీ. తన బయోగ్రఫీలో నటించే అవకాశం లభిస్తే తప్పకుండా చేస్తానని , విరాట్ బయోపిక్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందని రామ్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం రామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..ఇక స్కంద సినిమా విషయానికొస్తే….అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత బోయపాటి శ్రీను తెరకేక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ స్కంద. ఇక ఈ సినిమాలో రాముకు జోడిగా శ్రీ లీల నటిస్తుంది. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని పనులను పూర్తి చేసుకున్న స్కంద సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement