Bigg Boss 7 : అడ్డంగా బుక్ అయిన సీరియల్ బ్యాచ్….తప్పులను చూపిస్తూ ఆడేసుకున్న నాగార్జున….

Bigg Boss 7 : బిగ్ బాస్ షో అంటేనే నామినేషన్స్ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఇక వీకెండ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ పై వేసే సెటైర్లు …కానీ సీజన్ సెవెన్ మాత్రం అలాంటిదేం లేకుండానే మూడో వారం పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో నాగార్జున రూట్ మార్చాడు. బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ లో సీరియల్ బ్యాచ్ గా పేరు పొందిన అమర్ దీప్ మరియు శోభ శెట్టిని నాగార్జున ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. అయితే ముందు పెట్టిన గేమ్ లో అమర్ దీప్ తో సహా మరో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఈ కారణంతో అతడు గేమ్ ఆడడానికి అనర్హుడని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇక దీనిని గమనించిన నాగ్ నువ్వు దీనిని ఒప్పుకుంటున్నావా అని అమర్దీప్ ను డైరెక్ట్ గా అడిగాడు.

Advertisement

booked-serial-batch-nagarjuna-who-played-by-showing-mistakes

Advertisement

దీంతో అమర్ దీప్ నిలబడి లేదు సార్ అని చెప్పాడు. అలాంటప్పుడు నీ పాయింట్ ఎందుకు బయట పెట్టలేదని అమరదీప్ ని ప్రశ్నించాడు.అసలు నువ్వు గేమ్ నీకోసం ఆడుతున్నావా…? లేదా ప్రియాంక కోసం ఆడుతున్నావా ?అని నాగార్జున అడిగిన ప్రశ్నకు అమర్ నాకోసమే ఆడుతున్న సార్ అని సమాధానం ఇచ్చాడు. మరి అదే పాయింట్ ప్రశాంత్ చెబితే ఎందుకు గోల చేసావ్ అని నాగ్ అమర్ దీప్ ను ఆడేసుకున్నాడు. అనంతరం శోభతో మాట్లాడుతూ వీకెస్ట్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయమంటే ,యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని సైడ్ చేశావు. అంటే నువ్వు వీక్ అని ఒప్పుకున్నట్లేనా అని శోభ తో నాగార్జున అన్నాడు.

booked-serial-batch-nagarjuna-who-played-by-showing-mistakes

దీంతో ఆమెకు ఏం మాట్లాడాలి అర్థం కాక మౌనంగా ఉండిపోయింది.అయితే కిందటి రోజున ఆడిన గేమ్ లో సంచాలక్ గా సందీప్ ఫెయిల్ అయ్యాడని నాగార్జున ఇచ్చి పడేశారు. ఆట మధ్యలో నువ్వు అసలు రాకూడదు కానీ నువ్వు ఎందుకు పాయింట్స్ ఇస్తున్నావని ఆట సందీప్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. అనంతరం హౌస్ లోని సభ్యులు సందీప్ సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడని అనుకున్న వారు చేతులు పైకి లేపండని నాగ్ చెప్పగా హౌస్ లోని చాలామంది చేతుల పైకి లేపారు. దీంతో గ్రీన్ బ్యాటరీ కలిగి ఉన్న సందీప్ ను పసుపు బ్యాటరీ లెవెల్ కు తగ్గించాడు నాగార్జున.

Advertisement