Peacock Feather : నెమలి అంటే అందరికీ చాలా ఇష్టం. ఈ పక్షిని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. నెమలి నృత్యం చూస్తుంటే ఎవరికైనా రెండు కళ్ళు సరిపోవు.ఈరోజుల్లో చాలామంది ఇంట్లో డెకరేషన్ కోసం అలంకరిస్తూ ఉంటారు. చూడటానికి అందంగా కనిపించే నెమలి పించం చాలా పవిత్రమైనదిగా గుర్తింపు పొందిన విషయం అందరికీ తెలిసిందే. నెమలి కొంచెం ఒక పక్షి ఈకైనప్పటికీ మన జీవితంలో చాలా రకాల కష్టాలను పోగొడుతుంది. అని పండితులు చెబుతున్నారు.
కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉన్నట్లయితే ఈ నెమలి పించం ఆ బంధాన్ని తిరిగి కలుపుతుందట. అలాగే పిల్లలు సరిగా చదవకపోయినా, చురుగ్గా ఉండలేకపోయినా వారికి నెమలి పించం ఇస్తే వారిలో చాలా మార్పులు కలగదేస్తుందట. ఇక నెమలి పించంను ఉపయోగించడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరికి రాహు దశ నడుస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు.
Peacock Feather : ఇంట్లో నెమలి పించం ఉంటే, లాభమా…? నష్టమా..?

ఇటువంటివారు రాత్రి పడుకునే సమయంలో నెమలి పించంను పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం వల్ల ఆ పించం చెడు ప్రభావాన్ని దూరం చేస్తుంది. కొందరికి కొన్ని గ్రహాలు వల్ల కీడు జరుగుతుంది. అటువంటివారు ఇంట్లో పడకగదిలో తూర్పు వైపున లేదా ఈశాన్యం మూలలో నెమలి ఈ కలు ఉంచితే పనులు సంపూర్ణంగా పూర్తవుతాయి.
కొందరు పిల్లలకు పుస్తకాలలో నెమలి ఈకలు పెట్టుకోమని ఇస్తుంటారు. ఇలా పుస్తకాలలో నెమలి ఈ కలను పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత మెరుగుపరుస్తుంది. చదువులో వెనకబడిన వారు కూడా ముందంజులో అడుగుపెడతారు. అని పండితులు చెప్తున్నారు. అలాగే నెమలి పించం వాస్తు దోషాన్ని కూడా దూరం చేస్తుంది. ఇంటి గేటు ముందు వినాయకుడు వద్ద నెమలి ఈకను ఉంచినట్లయితే వాస్తు దోషం పోవడమే కాకుండా ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం చేస్తుంది