Balakrishna : ఎవరు ఊహించని పాత్రలో బాలయ్య… ఇక ఈ లుక్ లో కనిపిస్తే దబిడిదిబిడే…

Balakrishna :  బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘ అఖండ ‘ సినిమా లో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా సక్సెస్ తరువాత వరుసగా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వస్తున్నారు. తన తర్వాతి సినిమా గోపీచంద్ మలినేని తో చేస్తున్నారు. ఇక బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కంప్లీట్ అవగానే అనిల్ రావిపూడి తో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిందంట. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నారు. దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ టీజర్ మంచి రెస్పాన్స్ దక్కిచ్చుకుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోయే సినిమాలో బాలయ్య ఎన్నడూ చేయని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య ఈ సినిమాలో స్టైలిష్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారట. దీనికి తగ్గట్టుగానే ఆయన లుక్ కూడా ఓ రేంజ్ లో డిజైన్ చేశారట దర్శకుడు. ఇది నిజమో కాదో కొన్ని రోజులు వేచి చూడాలి. అయితే స్టైలిష్ గ్యాంగ్ స్టార్ లో బాలయ్య అనగానే ఫ్యాన్స్ ఓ రెంజ్ లో ఊహించుకుంటున్నారు. ఇక ఈ సినిమా గోపీచంద్ దర్శకత్వంలో వస్తున్న ఎన్బికె 107 సినిమా పూర్తి అయిన తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది.

Balakrishna : ఇక ఈ లుక్ లో కనిపిస్తే దబిడిదిబిడే…

Balakrishna act stylish gangstar role in NBK 108 movie
Balakrishna act stylish gangstar role in NBK 108 movie

ఇప్పటికే ఓసారి బాలయ్యతో సినిమా చేయాలని చూశాడు అనిల్ రావిపూడి కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఇక బాలయ్యతో ఇప్పుడు చేయబోయే సినిమా కథ తండ్రి, కూతురు మధ్య ఉంటుందంట. ఇందులో బాలయ్య 50 ఏళ్ల తండ్రి పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఇది సెట్స్ మీదకి వెళుతుందంట. ఇక బాలయ్యతో చేస్తున్న సినిమాలో తన మార్క్ కామెడీ కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వేన్స్ పుష్కలంగా ఉంటున్నట్లు అనిల్ రావిపూడి ఖరారు చేశారు. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటిస్తుందని అనిల్ తెలిపారు. శ్రీలీల అయితే ఈ సినిమాకు బాగుంటుందని ఆమె మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు