Ileana D’cruz : ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాధిస్తూ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇటీవల ఆగస్టు 1 న ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి కోవా ఫియోనిక్స్ డోలన్ అనే పేరు కూడా పెట్టింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. అయితే అక్టోబర్ 1 తో తన కొడుకు రెండు నెలలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన భుజంపై కుమారుడు సేద తీరుతుండగా ఇలియానా సెల్ఫీ తీసుకొని దానిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అప్పుడే రెండు నెలలు పూర్తయ్యాయి అంటూ రాస్కొచ్చింది.
అయితే తొలిసారి తన కొడుకు ముఖాన్ని చూపించడంతో , ఇలియానా పోస్ట్ పై బాలీవుడ్ , టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇలియానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన నేటిజనులు క్యూట్ బేబీ , బెస్ట్ మదర్, మీకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడిగిపెట్టిన ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారింది.
ఆ తర్వాత నడుము అందాలతో కుర్రకారులను ఆకట్టుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగు హిందీ భాషల్లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన ఇలియానా నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు రావడంతో టాలీవుడ్ కు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది కానీ తన బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయాన్ని మాత్రం ఇంతవరకు తెలియజేయలేదు.
View this post on Instagram