Mangli : లంబాడి సామాజిక వర్గానికి చెందిన జానపద గాయని మంగ్లీ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్.ఇక మంగ్లీ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక మ్యూజిక్ లో డిప్లమా పూర్తి చేశారు. అనంతరం యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన మంగ్లీ మ్యూజిక్ పై ఉన్న మక్కువతో అమోఘమైన వాయిస్ తో సింగర్ గా మారింది. అలా జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న మంగలి తోలుతా ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది.
ఇక అవన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టడంతో సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగలు బతుకమ్మ సమ్మక్క సారక్క బోనాల, ఉత్సవాలపై మంగ్లీ పాడిన పాటలు , యావత్ తెలుగు ప్రేక్షకులను ఆమె అభిమానులగా చేసుకున్నాయి. ఆయా పండుగలకు సంబంధించిన పాటలు ఇప్పటికీ గ్రామలలో వినిపిస్తూనే ఉంటాయి. అలా మొట్టమొదట యూట్యూబ్ పాటలతో అలరించిన మంగ్లీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైంది.
అలా యూట్యూబ్ పాటలతో మొదలైన మంగ్లీ కెరియర్ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ వరకు వచ్చింది. ఇది ఇలా ఉండగా త్వరలోనే మంగ్లీ తన భావ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అంతేకాక ఈ ఏడాది డిసెంబర్ నాటికి పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈ వార్తలపై మంగ్లీ స్పందించా