Jabardasth : జబర్దస్త్ లో రష్మీ గౌతమ్ తనపై పంచ్ వేసిన సునామీ సుధాకర్ కి మాస్ వార్నింగ్ ఇచ్చింది. దిగుతుంది అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. రష్మీ ప్రమోషన్ కొట్టేసిన విషయం తెలిసిందే. అనసూయ ప్లేస్ లో ఆమె బాధ్యత తీసుకొని జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తుంది. అనసూయ ప్లేస్ లో కొత్త యాంకర్ వస్తుందని అనుకున్న ప్రేక్షకులకు కొద్దిగా నిరాశే ఎదురయింది. ఏళ్ల తరబడి అనసూయ, రష్మీ లను చూసి విసిగిపోయిన ప్రేక్షకులు కొత్త అందం కోరుకున్నారు. కానీ మల్లెమాల అనూహ్యంగా రశ్మిని దింపి షాక్ ఇచ్చారు. కాకపోతే మొదటికే మోసం వస్తుందని వారు భావించి ఉండవచ్చు. సినిమా ఆఫర్స్ కూడా లేని రష్మీ టీవీ షోస్ ని నమ్ముకున్నారు. ఈ క్రమంలో ఆమెకు జబర్దస్త్ యాంకర్ గా కూడా అవకాశం రావడంతో ఫుల్ జోష్ లో ఉంది.
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్స్ గా ఆమె జీతం డబుల్ కానుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి సుడిగాలి సుధీర్ వెళ్లిపోగా ఆ షో యాంకరింగ్ కూడా రష్మినే చేస్తున్నారు. జబర్దస్త్ యాంకర్ గా ఫస్ట్ ఎపిసోడ్ పూర్తి చేసిన రష్మీ రెండో ఎపిసోడ్ కి సిద్ధమయ్యారు. ఆగస్టు 11న జబర్దస్త్ సెకండ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే తన అందంపై పంచువేసిన సునామి సుధాకర్ రశ్మి అందాన్ని ఉద్దేశిస్తూ, అది విస్కీ నా, రమ్మీనా, చూస్తుంటేనే కిక్ వస్తుంది అని అన్నాడు. దానికి ఆ పక్కనే ఉన్న కమెడియన్ దగ్గరగా చూడు దిగిపోద్ది అంటూ రష్మీ వైపుకు సుధాకర్ ని నెట్టాడు. ఆ పంచ్ కి రష్మీ నొచ్చుకుంది. ఇప్పుడు మీకు దిగుతుంది అంటూ కౌంటర్ వేసింది. రష్మీకి సుధాకర్ టీం వేసిన పంచ్ కోపం తెప్పించినట్లుగా కనిపించింది.
Jabardasth : సునామీ సుధాకర్ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన రష్మి…

గతంలో సుడిగాలి సుదీర్, హైపర్ ఆది లాంటి కమెడియన్స్ రష్మీపై ఇంతకంటే దారుణమైన పంచులు వేసేవారు. అయినా ఆమె పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు సుధాకర్ వేసిన చిన్నపాటి పంచుకి కూడా ఆమె కోప్పడడం విశేషం. ఇదిలా ఉంటే జబర్దస్త్ నుండి సింగర్ మను కూడా తప్పుకున్నారేమో అనిపిస్తుంది. తాజా ఎపిసోడ్ జడ్జిగా నటి ప్రగతి వచ్చారు. అలాగే కుష్బూ అప్పుడప్పుడు వస్తున్నారు. ఇంద్రజ మాత్రం ప్రతి ఎపిసోడ్లో కనిపిస్తున్నారు