Azmeera Bobby :ఆకాశమే నా హద్దు అంటూ… గగన విహారం చేస్తున్న తొలి తెలుగు గిరిజన మహిళా పైలట్ అజ్మీరా బాబీ…

azmeera bobby : తెలంగాణ లోని మంచిర్యాలకు చెందిన అజ్మీరా బాబీ ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ గా, ఏరోప్లేన్ పైలెట్ గా పనిచేస్తుంది. అసలు బాబీ చదివింది ఎంబీఏ. ఎంబీఏ నుంచి ఏవియేషన్ వైపు ఎలా వెళ్ళిందో తన మాటల్లోనే తెలుసుకుందాం. ఒకసారి నా మేనత్త కు వీడ్కోలు చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ విమానాలను చూశాక ఎక్కాలని, నడపాలని కలలు కన్నాను. కానీ మా వారు ఎవరు ఏవియేషన్ రంగంలో లేరు. అసలు దాని గురించి భరోసా ఇచ్చేవారు కూడా లేరు.

Advertisement

దాంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ నాపై నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ధైర్యంగా ముందుకెళ్లాను అని అజ్మీరా చెప్పుకొచ్చింది. ఎంబీఏ పూర్తి అయ్యాక కేబిన్ క్రూ సిబ్బంది కోసం ఒక ఎయిర్లైన్స్ ఇచ్చిన ప్రకటన చూసి వారికి దరఖాస్తు చేశా. లక్కీగా ఫస్ట్ ఛాన్స్ లోనే ఎయిర్ హోస్టెస్ గా ఎంపికయ్యాను. అదే నా లక్ష్యానికి మొదటి మెట్టు. ఎయిర్ హోస్టెస్ అంటే చాలా కుటుంబాలు ఒప్పుకోవు. కానీ తల్లిదండ్రులకు తమ పిల్లలపై నమ్మకం ఉండాలి.

Advertisement

Azmeera Bobby :ఆకాశమే నా హద్దు అంటూ అజ్మీరా బాబీ…

interesting facts about 1st tribal telugu pilot azmeera bobby
interesting facts about 1st tribal telugu pilot azmeera bobby

ఈ రంగంలోకి రావడానికి నా పేరెంట్స్, ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. అంతేకాదు ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ నాకు ఎంతో సహకారం అందించారు. ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూ ఉన్న సమయంలో పైలట్ ట్రైనింగ్ కు సెలెక్ట్ అయ్యాను. మొదటిసారి ఆకాశంలోకి ఎగిరినప్పుడు కొద్దిగా భయమేసింది. ఆ భయం వదిలితేనే ట్రైనింగ్ పూర్తి చేయగలమని అనిపించింది. ప్రతి విజయం వెనక కచ్చితంగా కష్టం అనేది ఉండాలి అని నేను నమ్ముతాను. ఆ కష్టం తర్వాత వచ్చే ఆనందం చాలా బాగుంటుంది అని బాబి అన్నారు.

మనలోని టాలెంట్ ను ఎవరు ఆపలేరు. ఈ రంగంలోకి వచ్చినప్పుడు పెద్ద సమస్యలు ఎదుర్కోనప్పటికీ కొన్నిసార్లు మాత్రం కులం గురించి అవమానాలు ఎదుర్కొన్నాను. ఎవరినైనా పని విషయంలో అడ్డుకోవచ్చు. అప్పుడు కాస్త కష్టంగా ఉంటుంది కానీ టాలెంట్ ను మాత్రం ఎవరు ఆపలేరు అని చెప్పుకొచ్చింది బాబి. ఏవియేషన్ రంగంలోకి రావాలంటే మాత్రం మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చి ఉండాలి.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి వివిధ సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయి. పరీక్షలు పాస్ అయితే ఫ్లయింగ్ కబ్ లో చేరాలి. లేకపోతే ప్లెయింగ్ లైసెన్స్ పోయే అవకాశం ఉంటుంది నన్ను ఆదర్శంగా తీసుకొని చాలామంది ఆడపిల్లలు నా దగ్గరకు వచ్చి సలహాలు, సూచనలు అడుగుతారు. ఇలాంటి వాటి వల్ల నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగే పైలట్ అవ్వాలనుకునే ఆడపిల్లలకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకొచ్చింది అజ్మీర బాబీ.

Advertisement