Nagarjuna : తన మొదటి పెళ్లి సమయంలో నాగార్జున ఎలా ఉన్నాడో చూస్తే నోరెళ్లబెడతారు.. ఫస్ట్ మ్యారేజ్ ఫోటో వైరల్

Nagarjuna : తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు స్టార్లుగా వెలుగొందిన వాళ్లు తమ వారసులను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర్నుంచి ఏఎన్నార్, కృష్ణంరాజు, కృష్ణ.. ఇలా సినిమా ఇండస్ట్రీని ఏలిన వాళ్ల వారసులు కూడా ఇప్పుడు మళ్లీ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు.

nagarjuna photo with his first wife lakshmi viral
nagarjuna photo with his first wife lakshmi viral

నట వారసులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ స్టార్ హీరోగా గుర్తింపును పొందుతున్నాడు అక్కినేని నాగార్జున. తన కొడుకులను కూడా ఆయన ఫిలిం ఇండస్ట్రీకే పరిచయం చేశాడు. అయినప్పటికీ ఇంకా స్టార్ హీరోగానే నాగార్జున గుర్తింపు పొందుతున్నాడు.

Nagarjuna : అప్పుడు మన్మథుడు అలా ఉన్నాడా?

ఇక.. నాగార్జున వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం. ఆయన మొదటి పెళ్లి గురించి అందరికీ తెలిసిందే. రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జున వివాహం జరిగింది. వాళ్లకు నాగచైతన్య పుట్టాడు. తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయారు.

నాగ చైతన్యను తీసుకెళ్లి తన దగ్గరే పెంచుకుంది లక్ష్మి. ఆ తర్వాత నాగార్జున, అప్పట్లో హీరోయిన్ గా ఉన్న అమలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు అఖిల్ పుట్టాడు. ఇండస్ట్రీకి తన ఇద్దరు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరినీ పరిచయం చేశాడు నాగ్.

nagarjuna photo with his first wife lakshmi viral
nagarjuna photo with his first wife lakshmi viral

అయితే.. తన మొదటి పెళ్లి నాటి ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ్, లక్ష్మి ఇద్దరూ దిగిన ఫోటో అది. ఆ ఫోటో ఇప్పటి వరకు ఎక్కడా కనబడలేదు. కానీ.. తాజాగా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఆ ఫోటోను చూసిన నెటిజన్లు.. అదేంటి నాగ్ అప్పుడు అలా ఉన్నాడా? అంటూ నోరెళ్లబెడుతున్నారు.

ఇక.. నాగార్జున సినిమా విషయాలకు వస్తే.. ఇటీవలే తన కొడుకు చైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించాడు నాగ్. అలాగే… బాలీవుడ్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త కూడా చేస్తున్నాడు. ఘోస్ట్ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు.