Smriti Mandhana : అందాల భామ, ఇండియన్ ఉమెన్ క్రికెటర్ స్మృితి మందాన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు

Smriti Mandhana : స్మృితి మందాన జూలై 18 , 1996 వ సంవత్సరంలో ముంబైలో జన్మించింది. తండ్రి పేరు శ్రీనివాస్ మందాన, తల్లిపేరు స్మిత మందాన. తండ్రి కెమికల్ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తూ ఉంటాడు. స్మృితి కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, తన పేరు శ్రావణ్, స్మృితి వాళ్ళ నాన్న, అన్నయ్య లు ఇద్దరూ జిల్లాస్థాయి క్రికెటర్స్ , స్మృితి కి రెండు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే ఫ్యామిలీ మహారాష్ట్ర లోని మాధవ్ నగర్ సంగ్లీకి షిఫ్ట్ అయ్యారు. తన విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేసుకుంది. ఇంటర్ వరకు సాఫీగా తన చదువును కొనసాగించిన స్మృితి మూడు సంవత్సరాలు అయినా తన డిగ్రీ ఇంకా మొదటి సంవత్సరంలోనే ఉంది.

కారణం మాక్స్ రాక ఫెయిల్ అవ్వడం వల్ల మాత్రం కాదు, తన ఎగ్జామ్స్ మ్యాచెస్ ఒకేసారి వస్తుండటం వలన ఫస్ట్ ప్రియారిటీ మ్యాచ్‌ కు ఇవ్వడం వలన ఎగ్జామ్ కి అటెండ్ అవ్వలేకపోయింది. స్మృితి తన 9 ఏళ్ల వయసులోనే మహారాష్ర్ట అండర్ 15 క్రికెట్ మ్యాచ్ ఆడి క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టింది.11 ఏళ్ల వయసులోనే మహారాష్ట్ర అండర్ 19 టీమ్ లో ఆమె ఎంపిక అయ్యింది. ఆమె బ్యాటింగ్ నైపుణ్యాన్ని ఇంకా మెరుగు పరిచేందుకు తన అన్న శ్రావణ్ ఇప్పటికీ తనకి బౌలింగ్ వేస్తూ సత్కరిస్తుంటారు.

Smriti Mandhana : స్మృితి మందాన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు

Interesting facts in the life of Indian woman cricketer Smriti Mandana
Interesting facts in the life of Indian woman cricketer Smriti Mandana

అక్టోబర్ 2013 లో తను సాధించిన ఘనవిజయం ఏమిటి అంటే మహారాష్ట్ర – గుజరాత్ కి మధ్య జరిగిన బెస్ట్ జోన్ అండర్ 19 మ్యాచ్ లో 150 బంతులు, 224 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ క్రికెటర్ గా తను రికార్డును నమోదు చేసుకుంది. స్మృితి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో వరుసగా పది సార్లు హాఫ్ సెంచరీలు చేసి, ఛేజింగ్ స్టార్ విరాట్ కోహ్లీకి సైతం లేని అరుదైన రికార్డుని నమోదు చేసుకుంది. స్మృతి మహారాష్ర్టలోని తన స్వస్థలం లో SM18 అనే పేరుతో ఒక కేఫ్ బిజినెస్ ని రన్ చేస్తోంది. 2014 ఆగస్టు లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో టెస్టు మ్యాచ్ లోకి అడుగుపెట్టింది.

ఆమె తన మొదటి రెండవ ఇన్నింగ్స్ ను వరుసగా 22 మరియు 51 పరుగులు చేసి తన జట్టు మ్యాచ్ గెలవడానికి కారణం అయ్యింది. ఇండియాలో క్రికెట్ చాలా ఫేమస్ అయిన ఆట, కానీ ఉమెన్స్ క్రికెట్ మాత్రం పెద్దగా ఫేమస్ అవ్వలేదు, అయినప్పటికీ తను లెఫ్ట్ హ్యాండర్ స్టైలిష్ బ్యాటింగ్ స్టైల్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రెగ్యులర్ ఓపెనర్ గా మంచి పేరు తెచ్చుకుంది. స్మృితి, క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేని వారు సైతం స్మృితి మందాన కోసం మ్యాచ్ చూసేలా చేసింది. తను స్మైల్ ఇస్తే కుర్రకారు లకు ట్రిపుల్ సెంచరీ కొట్టినంత ఆనందంగా ఉంటుంది.

లైవ్ వీడియో చాట్ లో అభిమానులతో ముచ్చటిస్తున్న స్మృితిని ఒక అభిమాని మీకు కాబోయే భర్తకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అడిగితే నాకు కాబోయే భర్తకి రెండు క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి, అందులో మొదటిది తను నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి, రెండవది నేను చెప్పింది కచ్చితంగా పాటించాలి అని సరదాగా సమాధానం ఇచ్చింది. ఒక మ్యాచ్ ఆడేముందు మీరు ఎన్ని పరుగులు చెయ్యాలో టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు నాకు మ్యాచ్ లో ఎన్ని పరుగులు తీయాలి అనే టార్గెట్ ఎప్పుడూ ఉండదు, కానీ టీమ్ ని ఎలా గెలిపించాలి అని టార్గెట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని సమాధానం చెప్పి తనలోని నాయకత్వ లక్షణాలు నిదర్శనమని చూపించుకుంది.

2017 లో స్మృితి మందాన మ్యాచ్ ఆడుతున్నప్పుడు మోకాళ్లకు బలమైన గాయం తగలడంతో 5 నెలలు నడవలేక ఇంట్లోనే ఉంది, డాక్టర్లు ఇక క్రికెట్ మ్యాచ్ కి దూరంగా ఉండాలి అని భయపెట్టిన తను ఆత్మవిశ్వాసంతో మళ్లీ కోలుకొని 2017 చివరిలో ప్రపంచ మహిళా క్రికెట్‌లో మందాన బెస్ట్ పర్ఫామెన్స్ తో విజృంభించింది. మొదటి మ్యాచ్‌లో నే ఇంగ్లాండ్ పై 90 పరుగులు చేసింది. వెస్టిండీస్ పై మరోసారి సంతకం సాధించి విజృంభించింది.2018 ఆగస్టులో జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో 30 బంతుల్లో 50 పరుగులు చేసి అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన భారతీయ క్రీడాకారునిగా అరుదైన రికార్డును నెలకొల్పింది.

2018 ఆగస్ట్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో 25 బంతుల్లో 50 పరుగులు చేసి తన పేరుతో ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టింది. ద్విశతకం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారునిగా రికార్డు, ఐసిసి ప్రకటించిన 2016 జట్టుకు భారతీయుల నుంచి స్థానం సంపాదించుకున్న ఏకైక భారత ఉమెన్. 2018 లో అర్జున అవార్డుతో సత్కారం, 2018 లో ఐసీసీ క్రికెటర్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు, 2019 ఫిబ్రవరి లో ప్రకటించిన ఐసీసీ బెస్ట్ ఉమెన్ ర్యాంకింగ్‌లో మొదటిస్థానం ఇలా మొత్తంగా చెప్పాలంటే ఇరవై అయిదు ఏళ్లలో తనకి ఇష్టమైన రంగంలో ఎన్ని విజయాలు సాధించాలో అన్ని విజయాలు సాధించి తనకంటే చిన్న వాళ్లకి ఆదర్శంగా నిలుస్తూ, తన కంటే పెద్ద వారికి తన విజయాలు ఇన్స్పిరేషన్ గా అనిపిస్తూ మంచి పేరును తెచ్చుకుంది.