Tollywood : ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు థియేటర్లలోకి వచ్చిన కానీ పెద్దగా సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. అభిమానులు కొన్ని పండగలకు తప్ప మిగతా టైం లో థియేటర్లకు రావడం లేదు అంటున్నారు సినీ వర్గాలు. సినీ అభిమానులకు నచ్చేలా వారు మెచ్చేలా సినిమా చేసిన కానీ పండగలు టైం లో మాత్రమే కొన్ని సినిమాలకు ఆదరణ చూపిస్తున్నారు అని సమాచారం. కొన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగకు మాత్రమే థియేటర్లకు వెళ్లి కొన్ని సినిమాలను బాగా ఆదరిస్తున్నారు.
ఇలా వెళ్లడం అభిమానులకు ఫ్యాషన్ గా మారింది. దానివల్ల కొందరు హీరోలు సంక్రాంతికి సినిమాలు బాక్స్ ఆఫీస్ భరిలోనికి తీసుకురావాలని పోటీ పడుతున్నారు. ఇలా వారసుడు అనే సినిమా తో విజయ్. దీంతోపాటు ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్, ఇలా తాజాగా సినిమాలు అదే టైం లో విడుదలకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా కొంత మంది హీరోలు కూడా సంక్రాంతి పండగ సినిమాలును అభిమానులకు అందించాలి అనుకుంటున్నారు.
Tollywood : సంక్రాంతి పండుగకు భారీగా సినిమాలు

వైష్ణవ్ తేజ్, విజయ్ తాజా సినిమాలే కాకుండా ప్రభాస్ నటిస్తున్న ఆది ఆదిపురుష్, ఇంకా ఎన్నో సినిమాలును మన ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి, బాబీ, కాంబినేషన్ లో చేసే సినిమా అభిమానులు ముందుకి సంక్రాంతి టైంలో రాబోతుంది అని చెప్తున్నారు. చిరంజీవి కాకుండా పావర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చేసే సినిమా హరిహర వీరమల్లు కూడా జనవరిలో సంక్రాంతి పండుగ కు రాబోతోంది. ఇట్లా ఎన్నో సినిమాలు సంక్రాంతి పండుగకు సందడి చేయబోతున్నట్లు టాక్.