Intinti Gruhalakshmi 13 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 13-September-2022 ఎపిసోడ్ 736 ముందుగా మీ కోసం. తులసి ప్రసాదాలు డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటే, అక్కడికి అంకిత, ప్రేమ్, శృతి వస్తారు. అంటీ దేవుడి మీద భారం వేయడం కాదు, మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు కదా, ఈరోజు సామ్రాట్ గారు మన ఇంటికి వచ్చారు,సంతోషంగా ఉన్నాను, ఏ తప్పు చెయ్యలేదని మీరు చెప్పొచ్చు కదా అని అనగానే ,సామ్రాట్ గారు అతిథి ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఆయన పిలవగానే గొడవ గురించి మాట్లాడకుండా ఇంటికి వచ్చారు, తన పెద్దరికాన్ని మనం కూడా కాపాడాలి కదా అని అనగానే, మీరు తప్పు చేయలేదు కదా అంటీ, నిజం చెప్పాలి కదా అని అంకిత అనడంతో, నేను నిజాన్ని చెప్తే దాని ప్రభావం, ప్రేమ్ వాళ్ళ నాన్న మీద కూడా పడుతుంది, వాళ్లు కుాడా ఈరోజు మన ఇంటికి వచ్చిన అతిథులే అని, ఇలా తులసి మాట్లాడే మాటలను, నందు లాస్య సామ్రాట్ ముగ్గురు వింటారు.అందరూ సంతోషంగా భోజనం తింటూ ఉంటారు, దివ్య సామ్రాట్తో, అంకుల్ మీకేం కావాలన్నా అడగండి, ఇది మీ ఇల్లే అని అంటుంది. ఒకవైపు తులసి లక్కీ, హనీలకు తినిపిస్తూ ఉంటుంది.
అప్పుడు నందు, లాస్య తో, నువ్వు లక్కీని హని కి దగ్గర చేద్దామనుకున్నావు, వాడేమో తులసి చుట్టూ తిరుగుతున్నాడు అని, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఆంటీ పప్పన్నం చాలా బాగుంది అని లక్కీ అనగానే, తులసి వాళ్ళ అత్తయ్య ఆ పప్పన్నం నచ్చకనే, మీ అంకుల్ వెళ్లిపోయాడు అని వెటకారంగా అంటోంది.తినే సమయంలో లక్కీ ఆంటీ ఎందుకు ఈ ఉండ్రాళ్ల పాయసాన్ని వినాయకుడికే పెడతారు అని అనడంతో, లాస్య ఏదో సమాధానం చెబుతుంది దాంతో, తులసి పిల్లలు అడిగిన దానికి సరైన సమాధానం చెప్పాలి అని అంటోంది, దాంతో తులసి వాళ్ళ మావయ్య నువ్వు చెప్పు అమ్మ అనడంతో, దానికి సరైన సమాధానాన్ని తులసి చెబుతుంది, దాంతో అందరూ సంతోషపడతారు.సామ్రాట్ చెయ్యి కడుక్కుంటూ ఉన్నప్పుడు, తులసితో ఇలా అంటాడు, నాకిప్పుడు అర్థమైంది మా హానికి మీ కుటుంబం అంటే ఎందుకు అంత ఇష్టమో, నేనే తప్పుగా మాట్లాడాను ఆ రోజు అని అనగానే, తులసి అలా ఏమీ లేదు మీ ప్లేస్లో ఉంటే ఎవరైనా అలాగే చేస్తారు అని అనడంతో, ఇంతలో అభి వచ్చి, కనీసం తనని సారీ కూడా చెప్పనివ్వడం లేదు, సారీ చెప్పి చేతులు దులిపేసుకుoదాము అని అనుకుంటున్నాడు అని, ఏదో మాట్లాడబోయే ముందు అంకిత అభిని తీసుకొని వెళుతుంది.
Intinti Gruhalakshmi 13 September Today Episode : తులసి మాటలను విని గిల్టీగా ఫీల్ అవుతున్న సామ్రాట్

అక్కడి నుంచి మేము వెళతాము ఇక అనేలోపు, దివ్య వచ్చి లేదంకుల్ ఈవినింగ్ గేమ్స్ ఆడుకోవాలి సరదాగా వుండండి. అనడంతో, సామ్రాట్ వుంటాడు. లాస్య వాళ్ళు వెళ్లిపోతుంటే అభి కూడా ఉండమని అనడంతో, అందరూ సరదాగా ఆటలు ఆడటం మొదలుపెడతారు.మొదట అంకిత అభి ఇద్దరి పేర్లు వస్తుంది, అందులో భార్య ఎలా ఉండాలి అనుకుంటున్నాడొ, భర్తగా చెప్పాలి. అప్పుడు అభి తన మనసులో ఉన్న బాధని అంకితతో చెపుతూ వుంటాడు.ఒకప్పుడు నేను నీ మనస్సులో మొదటిస్థానంలో ఉండేవాణ్ని, కానీ ఇప్పుడు నా స్థానం ఏంటో కూడా నాకు తెలియటం లేదు, దానికి కారణం ఎవరో నాకు తెలుసు కానీ, వాళ్ళ పేరు నేను చెప్పాలనుకోవడం లేదు,అని ఇలా మాట్లాడుతూ ఐ లవ్యూ అంకిత అని చెబుతాడు.తర్వాత దివ్య తన ఫేవరేట్ డైలాగ్ చెప్పమనడంతో, డైలాగ్ చెబుతుంది. దాని తరువాత ప్రేమ్, శ్రుతి కి ప్రేమలో ఉన్న జంట గొడవ పడితే ఎలా వుంటారో యాక్ట్ చేయమని వస్తుంది, దాంతో వాళ్లు కూడా అలా యాక్ట్ చేస్తారు.కానీ వీళ్లు నిజంగానే గొడవ పడుతూ ఉంటారు, దాంతో కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతారు .ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.