Intinti Gruhalakshmi 15 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 15-September-2022 ఎపిసోడ్ 738 ముందుగా మీ కోసం. నందు లాస్య కోపంగా ఇంటికి వెళతారు, ఇంటికి వెళ్లాక లాస్య తులసి మీద చాడీలు చెబుతూఉంటుంది. తులసి కావాలని సామ్రాట్కి మనకు తెలియకుండా నిజం చెప్పింది, మనముందు చెప్పనని నాటకాలాడి ఇప్పుడు తనే చెప్పింది అంటూ ఇలా తులసిపై చెబుతూ ఉంటుంది. తరువాత నందు,లాస్య కొద్దిసేపు మాట్లాడుకుంటారు. లాస్య నేనే ఆఫీస్కి వెళ్లి, సామ్రాట్తో మాట్లాడతాను, మన జాబు ఎలాగైనా కాపాడతాను అని చెపుతోంది.ఒకవైపు సామ్రాట్, వల్ల బాబాయ్తో ఇలా అంటూ ఉంటాడు, తులసి కొడుకు అంతా మాటలన్నందుకు ఖచ్చితంగా రాదు, రాకుండా ఉంటేనే మంచిది తనకు ఇబ్బందిగా ఉండదు అని అనగానే,నువ్వు నిజంగానే రావొద్దు అని అనుకుంటున్నావా, నువ్వనుకున్న హని తులసిని దూరం అవ్వనివ్వద్దు అని అంటాడు. ఇంతలో చూస్తే తులసి వస్తుంది ఆఫీస్కి, సామ్రాట్ చూసి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు.
Intinti Gruhalakshmi 15 September Today Episode : లాస్యకి వార్నింగ్ ఇచ్చిన తులసి
అప్పుడు తులసి అంటోంది నేను వస్తాను అని అనుకోలేదు కదా మీరు, మీరు నిన్న మంచిగా మాట్లాడారు ఆ ధైర్యంతోనే రాగలిగాను, లేకపోతే నా స్థానంలో ఎవరున్నా వచ్చేవారు కాదని, ఇలా ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది, సామ్రాట్ తనని క్యాబిన్లో కూర్చుని వెయిట్ చేయమని చెబుతాడు.సామ్రాట్ తులసితో ఇలా అంటాడు. మీకు నందు చాలా అన్యాయం చేశాడు, నిజాలన్నీ తెలుసు కాబట్టి లాస్య ఇప్పుడు ఇక్కడికి మాట్లాడ్డానికి వచ్చింది.మీ పర్సనల్ గొడవలన్నీ నాకు తెలుసు, మీకు వాళ్లుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అని కూడా తెలుసు, ఈ నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాను, వాళ్లు ఇక్కడ ఉండడం, లేదు అనేది నీ చేతుల్లో ఉంది, నీ నిర్ణయాన్ని నేను వాళ్ళకి నా నిర్ణయంగా చెబుతాను అని సామ్రాట్ అంటాడు తులసితో. తులసి ఇలా అంటుంది, నాకు చెడు చేసినా, నేను వాళ్ళకి హాని చెయ్యను అని అనడంతో, సామ్రాట్ నేనే డీల్ చేస్తాను అని లాస్య దగ్గరికి వెళతాడు.
లాస్య సారీ చెబుతుంది,సామ్రాట్ అడుగుతూ ఉంటాడు దేనికి సారీ చెబుతున్నావు అని,సార్ ఈ జాబ్ మాకు చాలా ముఖ్యం, రోడ్డునపడ్డ తాము దానికోసమే జాబ్ని రిస్క్లో పెట్టలేక ఆరోజు నేనే భయపడి నందుని నిజాన్ని దాచమని చెప్పాను, అందుకే నందు కూడా తులసి దగ్గరికి వెళ్లి అడిగాడు నిజం చెప్పొద్దని,మీ పర్సనల్ విషయాలు నాకు అనవసరం, కానీ నా కంపెనీలో ఎటువంటి డిస్ట్రబెన్స్ ఉండకూడదు అలా అని నువ్వు మాట ఇస్తేనే, మీ జాబ్స్ మీకు ఉంటాయి అనడంతో, తప్పకుండా సార్ థ్యాంక్యూ మమ్మల్ని క్షమించినందుకు అనడంతో,క్షమించిoది నేను కాదు, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది తులసికి అని అనడంతో, లాస్య తన ఇగోని పక్కకుపెట్టి తులసి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది, థ్యాంక్స్ అని చెబుతూ ఉంటుంది,ఇవాళ్టి దాకా నేను అనుభవించాను ఆ బాధ నీకు రావొద్దు అని, ఇలా చేశాను అనడంతో, అపకారం చేసిన వాళ్లకి కూడా ఉపకారం చేశావు అనడంతో, నిజానికి అది ఉపకారం కాదు, శిక్ష అని తులసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొక సారి నా విషయంలో జోక్యం చేసుకోవద్దని నీ భర్త నందగోపాల్ కి చెప్పు అని తులసి లాస్యతో అంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.