Intinti Gruhalakshmi 16th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 16-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం, తులసి నీ జైలునుంచి విడిపించేది ఎవరు

Intinti Gruhalakshmi 16th July Today Episode : సామ్రాట్ నిద్రపోతున్న హాని పాప దగ్గరికి వెళ్లి నిన్ను దూరం చేసుకున్నానేమో అని చాలా భయపడ్డాను ఏమైపోయేవాన్నో నువ్వు నా ప్రాణం నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్లని మాత్రం వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటాడు. ఆ పాప సామ్రాట్ వెళ్లిపోయాక కళ్ళు తెరుస్తుంది నాన్న మాట్లాడిన మాటలు అన్నీ వింటుంది. సామ్రాట్ వాళ్ళ బాబాయి సామ్రాట్తో నువ్వు ఎందుకో తులసి మీద నింద వేసినట్టు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు లేదు బాబాయ్ మోసం చేసేవాళ్లు ఇలానే ఉంటారు. అందరూ ఇలా ఇంతే అని కోపంగా తులసి అంతు చూస్తాను అని బాబాయ్ తో మాట్లాడుతూ ఉంటాడు.

ఇదంతా హనీ పాప వింటుంది తరువాత సామ్రాట్ వాళ్ళ భాబాయ్ దగ్గరికి హనీ పాప వెళ్ళి జరిగింది అంతా చెబుతుంది. దాంతో సామ్రాట్ వాళ్ళ భాబాయ్ చాలా పొరపాటు జరిగింది అమ్మ అని అంటాడు అప్పుడు పాప నాన్నకి భయపడి అలా చేశాను ఆంటీకి ఏమీ కాకూడదు తాతా అని మీరే ఏదో ఒకటి చేయండి అని అంటుంది పాప, సరే అమ్మా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు. సామ్రాట్ వాళ్ళ భాబాయ్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి తులసి వాళ్ళని వదిలేయండి కేసు వెనక్కి తీసుకుంటున్నామని అంటాడు.

Intinti Gruhalakshmi 16th July Today Episode : తులసి నీ జైలునుంచి విడిపించేది ఎవరు

Intinti Gruhalakshmi 16th July Today Episode
Intinti Gruhalakshmi 16th July Today Episode

ఎంతకైనా మంచిదని మేము ఒకసారి సామ్రాట్ గారితో మాట్లాడతామని పోలీస్ అంటాడు నేను చెప్తే సామ్రాట్ చెప్పినట్టే నేను లైన్ లోనే ఉంటాను వాళ్ళని విడిచి పెట్టండి అని అంటాడు ఫోన్ తులసికి ఇవ్వండి అని చెప్పాడు దాంతో పోలీసులు వాళ్లను వదిలిపెట్టి ఫోన్ మాట్లాడు అని తులసి కి ఇస్తారు అప్పుడు తులసి ఎవరు అని అడుగుతుంది అప్పుడు నేను సామ్రాట్ వాళ్ళ భాబాయ్ ని అమ్మ హనీ పాప జరిగింది అంతా చెప్పింది లోకం తెలియని ఒక చిన్నపిల్ల మాటలకు కట్టుబడి జైల్లో వున్నావు అంటేనే నీ వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది.

అమ్మ హాస్పిటల్ కి కూడా కాల్ చేసి కనుక్కున్నాను నీ నిజాయితీని నిర్ధారణ చేసుకున్నాను అందుకే జరిగిన తప్పును సరిదిద్దుకున్నాను అని అంటుంది అప్పుడు తులసి మరి పోయినా మా పరువు సంగతి ఏంటి సార్ జైలుకెళ్లి వచ్చిన వాళ్లమని మామీద ముద్రపడింది ఎలా తలెత్తుకుని తిరుగుతాము అని అంటుంది అప్పుడు క్షమించమని అడగడం తప్పా ఏమీ చేయలేని నిస్సహాయుడిని అమ్మా నేను కానీ ఒక సహాయం చెయ్యి అమ్మా మా హనీని యాక్సిడెంట్ చేసి పారిపోయినవాడి ఫొటో తెలిసినా కనపడినా నాకు చెప్పమ్మా ప్లీజ్ అని ఉంటాడు.

తర్వాత లాస్య ఇంటికి తులసి వెళుతుంది ఏంటి వచ్చావు అని లాస్య అంటుంది అప్పుడు తులసి అయినదానికి కానిదానికి మా ఇంటి మీద పడి గొడవ చేయడం మీ ఆయనకు అలవాటు కదా ఇప్పుడు నేను నిలదీద్దామని వచ్చాను అని అంటుంది తులసి అప్పుడు లాస్య ఏం తప్పు చేసాడు అని అంటే యాక్సిడెంట్ చేయడం తప్పుకాదా యాక్సిడెంట్లో గాయపడి స్పృహ తప్పి పడిఉన్న పాపను పట్టించుకోకుండా పారిపోవడం తప్పుకాదా ఆ పాపకి ఏమైందో ఎలావుందో తెలుసుకోకపోవడం తప్పుకాదా అని తులసి అంటుంది అప్పుడు లాస్య యాక్సిడెంట్ ఏంటి ఏదో ఒకవంక పెట్టుకుని మా ఇంటి ముందు అల్లరి చేయడానికి వచ్చావు మర్యాదగా బయటికి వెళ్ళు అని అంటుంది.

అప్పుడు తులసి వెళ్ళకపోతే పోలీసులని పిలుస్తావా నాకు కావలసింది కూడా అదే అని రోడ్డు నెంబర్ టూ లో మీరు చేసిన యాక్సిడెంట్ ని కళ్ళారా నేనే చూశాను సాక్షిని నేనే అని పోలీసులకు చెప్తాను పాపను నేను కిడ్నాప్ చేశాను అని నా మీద కేసు పెట్టారు నాతో పాటు మీ అమ్మా నాన్నల్ని కూడా జైల్లో పెట్టారు తప్పుచేసిన మీరు దర్జాగా తిరుగుతుంటే మేము నిందను మోస్తున్నాం మేము అవమాన పాలు అవుతున్నాము.

తలెత్తుకుని తిరగలేక పోతున్నాము అర్థమౌతుందా అని తులసి కోపంగా అంటుంది అప్పుడు లాస్య తప్పు నీది రోడ్డుమీద ఏదో యాక్సిడెంట్ జరిగితే చూసి తల తిప్పుకొని వెళ్లకుండా ఎవ్వరు నిన్ను ఇబ్బంది పడమన్నారు అని లాస్య అంటుంది అప్పుడు తులసి ఆస్థానంలో నీ బాబు ఉన్నా కూడా అలానే చేస్తావా అని మానవత్వం గా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి తరువాత నందు లాస్యతో నీ వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని అంటాడు. అప్పుడు లాస్య రేపు సామ్రాట్ గారిని కలిసే దాని గురించి ఆలోచించు కేసు ఎలాగో తప్పించుకున్నాము.

కదా అని అంటుంది తరువాత తులసిని ఇంటివాళ్లు నిలదీస్తారు ఇంత మంచితనం ఉండకూడదు అని తర్వాత తులసి బాధపడుతుా ప్రేమ్ తో ఇంట్లో వాళ్లే కాదు బయట వాళ్లు కూడా అంటున్నారు అన్నీ నెత్తిమీద వేసుకోవద్దు అని అనవసరంగా ఇంట్లోవాళ్లని బాధపడుతున్నాను అని అంటుంది అప్పుడు ప్రేమ్ మా అమ్మ చేసింది ఎప్పుడు ఏది తప్పు కాదు అని అంటాడు, నేను ఆ పాపను రక్షించి ఇంటికి చేర్చాలి అని అనుకోవడం వల్లనే కదా ఇదంతా అని అంటుంది. అప్పుడు ప్రేమ్ నువ్వు ముగ్గురు పిల్లల తల్లి వి పేగు బంధం విలువ తెలిసిన దానివి మరో తల్లిబిడ్డ చావుబతుకుల మధ్య రోడ్డు మీద పడి ఉంది అంటే పట్టించుకోకుండా నువ్వు ఉండలేవు.

అమ్మ అదే మా అమ్మ గొప్పతనం అదే మాకు ఆదర్శం అని ప్రేమ్ తులసితో అంటాడు ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ప్రేమ్ తులసి కి చెక్ ని ఇస్తాడు ఇది ఏంటి అని అడిగితే మొన్న కాంపిటీషన్లో నేను గెలుచుకున్న డబ్బు అమ్మా అని అంటాడు నాకెందుకు ఇస్తున్నావు అని తులసి అడిగితే ఈ డబ్బుతో మా అమ్మ మ్యూజిక్ స్కూల్ ని స్టార్ట్ చేస్తే చూసి సంతోషిస్తాను అని అంటాడు ప్రేమ్ అప్పుడు తులసి నా స్కూల్ విషయం పక్కకిపెట్టు దానికి వేరే దారి చూశాను ఈ డబ్బుతో వెంటనే ఆల్బమ్ చేయి ఇది అమ్మ కోరిక కానీ ప్రేమ్ కి ఇస్తుంది. తర్వాత సామ్రాట్ని నందు లాస్య కలుస్తారు నoదు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఇంతకుముందు కూడా మేము కంపెనీని స్టార్ట్ చేశాము అని అంటాడు.

మరి ఆ కంపెనీ ఏమైంది అని సామ్రాట్ అడుగుతారు, క్లోస్ చేయాల్సి వచ్చింది సార్ అని అంటాడు ఎందుకు అని అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనుకున్నట్టు దొరకలేదు అని సమాధానం చెబుతాడు ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేశారా అని అంటాడు అప్పుడు లాస్య ఈ సారి ఆ తప్పు జరగదు సార్ పకడ్బందీగా ప్రాజెక్ట్ ప్రపోజల్ రెడీ చేశాము అని అంటోంది అవును సార్ అని నందు అంటాడు అప్పుడు సామ్రాట్ అవును మీకు నిన్న కదా అపాయింట్మెంట్ ఇచ్చింది అంటాడు ఇచ్చిన టైమ్కే వచ్చాము కానీ అర్జెంట్ ఫోన్కాల్ రావడంతో మీరు వెళ్లిపోయారు అని నందు అంటాడు.

ఇంతలో సామ్రాట్ కి ఫోన్ వస్తుంది ఫోన్లో ఎస్ఐగారితో మా పాపకి యాక్సిడెoటు చేసినవారి ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికాయా అని అంటాడు ఏమీ దొరకలేదు సార్ అనడంతో లాకప్ లో వున్న తులసి కూడా ఏమీ చెప్పడం లేదా అని అంటాడు దాంతో నందు వాళ్లకి అర్థమవుతుంది యాక్సిడెంట్ చేసింది సామ్రాట్ వాళ్ళ పాపకి అని టెన్షన్ పడుతూ ఉంటారు నందు లాస్య. అప్పుడు పోలీస్ అదేంటి సార్ తులసి వాళ్లని వదిలేయమని మీరే కదా చెప్పారు అని అంటాడు అప్పుడు సామ్రాట్ వాట్ ఎవరు వదిలేయమని చెప్పారు అని అడుగుతాడు అప్పుడు పోలీస్ మీ బాబాయి వదిలేయమని చెప్పాడు.

అని మీతో చెప్పలేదా సార్ అని అంటాడు మర్చిపోయి వుంటాడు అని యాక్సిడెంట్ చేసిన వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలి పెట్టకూడదు అని అంటాడు తర్వాత నందు టెన్షన్ పడటాన్ని గమనించి సామ్రాట్ అసలు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అని అంటాడు వాళ్ళతో అప్పుడు నందు టెన్షన్ ఏమీ లేదు సార్ అని అంటాడు. అప్పుడు సామ్రాట్ మనుషులు ఎందుకు పుడుతున్నారో అర్థం కావటం లేదు చూడటానికి పాత సినిమాల్లో సావిత్రిలాగా పద్ధతిగా ఉంది కానీ డేంజరస్ డెవిల్ అమ్మో అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు లాస్య ఎవరు సార్ అని అంటుంది.

అప్పుడు సామ్రాట్ ఉందిలే తులసి అని మా పాపను కిడ్నాప్ చేసింది అడిగితే యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో జాయిన్ చేశాను అని అంటుంది వదిలిపెడతానా కొద్దిసేపట్లో యాక్సిడెంట్ చేసినవాడిని పట్టుకుంటాను వాడితో సంబంధం ఉంటే తులసిని వదిలిపెట్టను అని అంటాడు నేనేంటో చూపిస్తాను అని అంటాడు అప్పుడు లాస్య సార్ మరి బిజినెస్ ప్రపోజల్ అని అడిగితే సామ్రాట్ ప్రపోజల్ ఓకే కానీ నీ మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి అని నందుతో మిస్టర్ నన్ను మీరు కొద్దిరోజులు ప్రాజెక్టు మేనేజర్గా నాదగ్గర జాయిన్ అవ్వండి.

తర్వాత బిజినెస్ ప్రపోజల్ గురించి ఆలోచిద్దాం అని అంటాడు మళ్ళీ చెబుతున్నాను అబద్ధాలు ఆడకూడదు సిన్సియర్ గా ఉండాలి అని నందుతో చెబుతాడు అప్పుడు సరే సార్ అని అంటాడు తరువాత తులసి డ్యాన్స్ స్కూల్ రూమ్ రెంట్ కి ఇస్తారో లేదో అని అడగడానికి వెళ్లబోతోంది అప్పుడు వాళ్ళ అత్తామామ ముందు ఫోన్ చేసి కనుక్కో అమ్మ అని అంటూ ఉంటారు ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.