Janaki Kalaganaledu : జానకి రామని పిల్లలు కనడం కోసం ఒప్పిస్తుందా… జానకి మాటలు విని రామ ఒప్పుకుంటాడా…

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా ప్రచారం కాదు 18 సోమవారం ఎపిసోడ్ 346 హైలెట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం… జ్ఞానాంబ మల్లికను తిడుతూ ఉంటుంది. విష్ణు విషయంలో ఇంకొక్కసారి ఇలా ప్రవర్తించావంటే నీకు మామూలుగా ఉండదు అని గట్టిగా క్లాస్ పీకుతుంది. అదేవిధంగా గోవిందరాజు కూడా తనమీద సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు. అలాగే అత్తయ్య గారు అని మళ్లీ జానకి రామ గదిలో వైపు వెళ్తూ ఉంటుంది.

అప్పుడు గోవిందరాజు అమ్మ మల్లికా నువ్వు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నావు నువ్వు మళ్ళీ వాళ్ళ గది వైపే వెళ్తున్నావు అని అంటాడు. అప్పుడు ఆశ్చర్యంగా ఓ అవునా మామయ్య గారు అని వాళ్ళ గది వైపు వెళుతుంది. తను రామ జానకిల ఏకాంతాన్ని పాడు చేయాలని ఎలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రామ షాప్ నుంచి ఇంటికి వస్తాడు జానకి తనని గదిలోకి తీసుకొని వెళ్తుంది. రామని అడుగుతుంది స్వీట్స్ పూలు తీసుకురమ్మ నా గదా రామ గారు ఏవి అని అడుగుతుంది.

Janaki Kalaganaledu : జానకి రామని పిల్లలు కనడం కోసం ఒప్పిస్తుందా

Janaki Lagu Lagu serial latest 18th july 346episode
Janaki Lagu Lagu serial latest 18th july 346episode

రామ జానకి గారు మీరు ఏంటో ఎంతగా ప్రవర్తిస్తున్నారు నాకేమో కంగారుగా ఉంది. అని అంటాడు. జానకి అత్తయ్య మామయ్యల ఆశయం కోసం రామని కన్విన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రామని ఫస్ట్ నైట్ జరిగింది అని నమ్మించాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. తన ప్లాన్ ఏదో విధంగా సక్సెస్ చేయాలని అనుకుంటుంది. కానీ రామ మాత్రం అస్సలు ఒప్పుకోడు జానకి ఐపీసీ కలను నెరవేర్చాలని భర్తగా అది నా బాధ్యత అని అంటుంటాడు.

అలాగే జానకి అమ్మానాన్నల కోరిక కూడా అదే ఈ కోరికను ఎలాగైనా నెరవేరుస్తాను అని మనసులో గట్టిగా అనుకుంటాడు. జానకి జ్ఞానంబ ఆశయం కోసం ఆనందం కోసం రామని ఒప్పించాలి పిల్లల కనాలి అని అనుకుంటుంది. కానీ రామ నా భార్య ఐపీఎస్ అవ్వాలి తన కోరిక నెరవేరాలి. తన పెళ్లికి ముందు ఆగిపోయిన కల పెళ్లి తర్వాత నేను ఆ ఆశయాన్ని నెరవేర్చాలి అని అనుకుంటాడు అందుకే జానకిని దూరం పెడుతూ ఉంటాడు. జానకి దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటుంది రామ దూరంగా ఉండాలని చూస్తూ ఉంటాడు. అంతే సోమవారం ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే…